ఒక్క దెబ్బతో మూడు పిట్టలను టార్గెట్ చేసిన తారక్.. దేవర దెబ్బ‌కు దిమ్మ తిరిగాల్సిందే..!

టాలీవుడ్ హీరోల యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా స్మార్ట్. ఈ కామెంట్ చాలామంది సెలబ్రిటీస్ నోట ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాం. ఎవరిని ఎలా సెట్ చేయాలో.. ఎన్టీఆర్‌కు ఒక్క స్ట్రాటజీ ఉంటుందని.. ఎప్పటికప్పుడు తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఎన్టీఆర్ తన ప్లానింగ్ సిద్ధం చేసుకునే ఉంటాడని.. విమ‌ర్శ‌లు వస్తే ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని ఎలా కట్ చేయాలో అనే కోణాన్ని కూడా ముందుగానే స్కెచ్ గీసుకొని రంగంలో దిగుతాడంటూ స‌న్నిహితులు చెప్తుంటారు. ఇది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి అదే స్ట్రాట‌జీ వాడుతున్నాడు. ఒక్క టూర్‌తో నెగిటివ్ ప్రచారం మొత్తాన్ని సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

Peddi: Jr NTR, Ram Charan Fans In Ugly Fight

ఇంకొక 15 రోజుల్లో దేవర రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్ తర్వాత చాలా నెగిటివ్ టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, టీడిపి శ్రేణులు ఇలా చాలా మంది తార‌క్‌ను టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తారక్ వరద బాధితులకు సహాయం ప్రకటించిన విరాళాన్ని ఏపీకి వచ్చి చంద్రబాబుకు అప్పగించాలని.. దీనికోసం ఓ మీటింగ్ సెట్ చేసినట్లు తెలుస్తుంది. ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షలు విరాళం తారక్‌ ప్రకటించగా.. ఏపీకి ఇవ్వాల్సిన రూ.50 లక్షల చెక్ స్వయంగా చంద్రబాబును కలిసి అందజేయనున్నారు. వచ్చేటప్పుడు త‌నతో భార్య, త‌ల్లిని కాకుండా రామ్ చరణ్‌తో కలిసి వస్తున్నాడని.. దీని మొత్తానికి తారక్ దగ్గర ఓ ప్లాన్ ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Jr NTR: 'చంద్రబాబు మామయ్యా..! మీరు త్వరగా కోలుకోవాలి'.. జూనియర్ ఎన్టీఆర్  ట్వీట్ - Telugu News | JR NTR Wishing Speedy Recovery Good Health For  Chandrababu Nara Lokesh TDP | TV9 Telugu

చంద్రబాబును కలిస్తే టిడిపి శ్రేణుల‌ నెగిటివిటీకి చెక్ పెట్టవచ్చు. ఏపీ, తెలంగాణలో ఇది కలిసొస్తుంది. బాలయ్య ఫ్యాన్స్ కూడా కాస్త కోపాన్ని తగ్గించుకునే అవ‌కాశం ఉండ‌టంతో అలా ప్లాన్ చేస్తున్నార‌ట. ఇక చరణ్‌తో కలిసి రావడం వల్ల మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ కూడా సెట్ అయిపోతారు. గతంలో కొరటాల ఆచార్య ప్లాప్ తో.. ఆయనపై ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. దీంతో పాటు అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ పీక‌లోతు కోపంలో ఉన్నారు. అల్లు అర్జున్‌తో ఎన్టీఆర్‌కు మంచి స్నేహం ఉంది. ఈ క్ర‌మంలో మెగా ఫ్యాన్ అందరిని సెట్ చేయడానికి చ‌ర‌ణ్‌ను రంగంలోకి దింపుతున్నాడట తారక్. ఇలా ఒక్క టూర్‌లో ఏకంగా మూడు పిట్టాలని కొట్టవచ్చనే మస్టర్ ప్లాన్ తో దేవర ఉన్నాడట. ఇక తారక్ చేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయితే దేవర దెబ్బకు దిమ్మ తిరిగిపోవాల్సిందే అన‌డంలో సందేహం లేదు.