సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన ఎప్పుడు రిజర్వ్డ్గా ఉంటాడు. బయట పార్టీలు, పబ్‌లు, ఫ్రెండ్స్ లాంటి వాటికి దూరంగా ఉంటూ కేవలం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాస్త ఖాళీ దొరికిన ఫ్యామిలీతో వెకేషన్ లకు, ట్రిపులకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇద్దరు పిల్లల కెరీర్ విషయంలో పక్క ప్లానింగ్ తో మహేష్ ఉన్నట్లు తెలుస్తుంది. మహేష్ తనయుడు గౌతమ్ ప్రస్తుతం ఫారెన్ లో చదువును పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చదువుపై ఫోకస్ పెట్టిన గౌతమ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువులో రాణిస్తున్నాడు. ఇక కూతురు సితార సోషల్ మీడియాలో స్టార్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ వయసులోనే అమ్మడు మిడిల్రేంజ్ హీరోయిన్లకు ఉండే రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఆమె చేసే వీడియోస్‌కు, ఆమె ఫొటోస్‌కు అభిమానుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఇప్పటికే సితార ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబులా సమాజసేవలో కూడా పాల్గొంటూ.. చిన్నతనంలోనే పేదలకు సాయం అందించడంలో పెద్ద చెయ్యి అందిస్తుంది. ఇక సితార కెరీర్ విషయంలో తనకు మహేష్ పూర్తి ఫ్రీడమ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే సినిమాలో రాణించాలని కోరుకుంటుంది సితారా. క్లాసికల్, వేస్ట్రన్ డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్, జిమ్ ఇలా అనింటిలో శిక్షణ తీసుకుంటూ ఫ్యూచర్ కోసం సిద్ధమవుతుంది. తాజాగా అమ్మడు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్న ఫోటో నెటిటంట తెగ వైరల్ గా మారింది. ఇవన్నీ చూస్తుంటే సితార కచ్చితంగా సినిమాల్లో రాణించడం ఖాయమని.. స్టార్ హీరోయిన్గా ఎదగడం పక్క అంటూ అభిమానుల్లో నమ్మకం ఏర్పడింది.
ఇక ఎటువంటి సినిమాల్లో నటించకపోయినా ఈ అమ్మడు స్వతహా గానే సినిమా రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ను సంపాదించుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తుంది. మహేష్ తో కలిసి హాజరు కావడం ఇక ప్రతి విషయంలోనూ యాక్టివ్‌గా ఉంటూ అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఇక మహేష్ వారసుడు గౌతం మాత్రం.. సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం చదువుపై మాత్రమే ఫోకస్ పెడుతున్నాడు. తన చిన్నతనంలోనే వన్ నేనొక్కడినే సినిమాలో మాత్రమే గౌతం నటించాడు. తర్వాత ఎటువంటి సినిమాల్లోనూ ఆయన కనిపించలేదు. ఈ క్రమంలో సితారను హీరోయిన్ గా చేయాలని మహేష్ గట్టిగా ఫిక్స్ అయ్యాడని.. అయితే గౌతమ్ విషయంలో ఆయన ఏం చేయబోతున్నాడు.. అనే సందేహాలు మొదలయ్యాయి. గౌతమ్‌ను సినీ ఫీల్డ్ కు దూరంగానే ఉంచుతాడా.. లేదా గౌతమ్‌ను కూడా సినీ ఇండస్ట్రీ లో హీరోగా చేస్తారా అనే విషయాల్లో అభిమానుల సందేహాలు మొదలయ్యాయి. గౌతమ్ విషయంలో మహేష్ ఆలోచన ఎలా ఉందో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.