గత కొద్ది రోజులుగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదం నెటింట చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వీరి వివాదంలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. మ్యాటర్ ఏంటంటే.. తాజాగా రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి.. లావణ్య అతనిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా నాతో లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్న రాజ్ తరుణ్.. సీక్రెట్ గా నన్ను పెళ్లి కూడా చేసుకున్నాడని.. రెండుసార్లు నాకు అబార్షన్ అయ్యిందంటూ వివరించింది. కేవలం మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్.. నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని.. నాకు తను కావాలంటూ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాలపై కేస్ పెట్టింది లావణ్య. ఈ ఆరోపణలు రాజ్ తరుణ్ ఖండిస్తూ లావణ్యతో నేను రిలేషన్‌లో ఉన్న మాట వాస్తవమే. కానీ ఎలాంటి శారీరిక సంబంధం లేదని.. ఆమెను నేను అసలు వివాహం కూడా చేసుకోలేదంటూ వివరించాడు.
లావణ్య కు డ్రగ్స్ అలవాటు ఉందని.. ఆమె నన్ను బాగా టార్చర్ చేసిందంటూ రాజ్ తరుణ్ వివరించాడు. ఈ వివాదంలో తాజాగా లావణ్య పేరెంట్స్ రంగంలోకి దిగారు. లావణ్య తండ్రీ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వివరించాడు. లావణ్య, రాజ్ తరుణ్ రిలేషన్ గురించి మాకు ముందే తెలుసు.. మా అమ్మాయి మీద ఉన్న నమ్మకంతో రాజ్ తరుణ్‌ను మేము కూడా నమ్మాం. రాజ్ తరుణ్ పేరెంట్స్ తో కూడా మాకు మంచి బాండ్ ఉంది. ఒకరి ఇంటికి మరొకరు రావడం, మాట్లాడుకోవడం చేసే వాళ్ళం. మూడు నెలలుగా అతని పేరెంట్స్ ఫోన్ కలవడం లేదు. వాళ్ళు నెంబర్ మార్చేసి ఉండొచ్చు. అతనితో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా మాతో మాట్లాడడం మానేశారు. రాజ్ తరుణ్ తో లావణ్య పెళ్లి, అబార్షన్ లాంటి విషయాలు అన్నీ మాకు తెలుసు.
కానీ కూతురికి సంబంధించిన ఈ విషయాలు ఎవరు బయటకి చెప్పుకోలేం కదా. అందుకే మేము ఇప్పటివరకు వీటిని దాచి ఉంచాం. లావణ్య కు డ్రగ్స్ అలవాటు ఉందని ఆరోపణలో అసలు నిజం లేదంటూ తండ్రి చెప్పుకొచ్చాడు. మా అమ్మాయి ఎలాంటిదో మాకు తెలుసు. కనీసం చాక్లెట్ ఎలా తినాలో కూడా ఆమెకు తెలియదు.. అలాంటి అమ్మాయి డ్రగ్స్ ఎలా తీసుకుంటుంది.. అంటూ ప్రశ్నించాడు. లావణ్య కు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలుస్తుంది. ఆమెకు ఏదైనా జరిగితే మేము కూడా ఉండం.. రాజ్ తరున్ తిరిగి వస్తే పెళ్లి చేస్తాం. లేదంటే పోరాటం తప్పదు అంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశాడు. రాజ్ తరుణ్ తో.. లావణ్య పేరెంట్స్ కి గట్టి పరిచయం ఉన్నట్లు ఆయన మాటలు ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఇరు కుటుంబాల పెద్దలు కలవడం, మాట్లాడుకోవడం జరుగుతూ ఉండేవని లావణ్య తండ్రి మాటలతో క్లారిటీ వచ్చింది.