అవి చిన్నగా ఉండడంతో ఛాన్సులు రావడం లేదు.. సర్జరీ చేయించుకున్నా.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్‌డం సంపాదించాలంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప‌లు సందర్భాల్లో ఆఫర్ల కోసం తమ అందాన్ని మరింతగా పెంచుకునేందుకు.. ఎన్నో ఉకాల సర్జరీలు కూడా చేయించుకోవాల్సి వస్తుంది. అలా తను కూడా ఆఫర్ల కోసం సర్జరీ చేయించుకున్నాను అంటూ వివరించింది బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య. మొదట సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న శ్రీ సత్య.. తర్వాత పలు బుల్లితెర సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక‌ బిగ్‌బాస్‌లో ఆఫర్ కొట్టేసి.. త‌న ఆట తీరుతో భారీ పాపులారిటి దక్కించుకుంది. ఈ షో ద్వారా అందరి మనసులు దోచేసిన శ్రీ స‌త్య‌ ప్రస్తుతం పలు సినిమాలు, షోలతో బిజీబిజీగా గడుపుతుంది.

Bigg Boss Telugu Contestants List With Photos, 43% OFF

అలాగే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుందిజ‌ తన హాట్ ఫొటోస్. లేటెస్ట్ ఫోటోషూట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. కాగా గత కొద్ది రోజులుగా శ్రీ సత్య తన పెదవులకు సర్జరీ చేయించుకుందంటూ వార్తలు తెగ వైరల్ గా మారాయి. అలాగే త‌న లెటెస్ట్ లుక్స్‌తో తీవ్రంగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ సత్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. శ్రీ సత్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సర్జరీ చేయించుకోవడానికి కారణం ఇది అంటూ షాకింగ్ విషయాన్ని రివిల్ చేసింది. ఛాన్సుల కోసం ఎక్కడికి వెళ్ళినా.. నీ లిప్స్ చాలా చిన్నగా ఉన్నాయి.. చిన్నపిల్లలాగా కనిపిస్తున్నావు అనే వారిని.. కేవలం అవి చిన్నగా ఉండడంతోనే ఆఫర్లు ఇవ్వట్లేదు అంటూ చెప్పుకొచ్చింది.

Sri Satya (Bigg Boss Telugu 6) Height, Age, Boyfriend, Family, Biography &  More » StarsUnfolded

అందుకే నేను లిప్స్ కి సర్జరీ చేయించుకున్నానని.. అది పర్మినెంట్ కాదు.. మూడు నెలల తర్వాత సెట్ అవుతుంది అంటూ వివరించింది. ఇక సినిమా వాళ్లు ప్రస్తుతం న‌న్నుచూసి ఇప్పుడు బాగున్నాయి అంటున్నారని.. ఈ లిప్ ఫీలింగ్ అనేది త్వ‌ర‌లో పోతుంది.. అప్పటివరకు నాకు ఈ ట్రోల్లింగ్స్‌ తప్పవు అంటూ వివరించింది. తర్వాత పెళ్లి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. పెళ్లి గురించి మాట్లాడుతూ.. అసలు నేను పెళ్లి చేసుకోను.. ఫీలింగ్స్ చచ్చిపోయాయి. కే డ్రామాస్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్లు ప్రేమించుకునే విధానం బాగుంటుంది. అయితే కొందరు నాకు యాటిట్యూడ్ అంటారు. అయితే నాకు అసలు యాటిట్యూడ్ ఉండదు. కొంచెం భయం ఉంటుంది. అలాగే నాకు నటించడం రాదు. ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే వదిలిపెట్టలేను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీ సత్య చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారాయి.