టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాహసోపేత సినిమాల్లో నటించడంలో నెంబర్ వన్ హీరోగా ఉండే కృష్ణ అనుకున్నది తడవుగా అది ఎలాంటి వారినైనా ఢీకొట్టడానికి సిద్ధమవుతాడు. రాజకుమారి దొరికిన దొరకకపోయినా.. డింభకుడు సాహసం చేయడమే అన్నట్లుగా ఆయన ఎన్నో సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలో కృష్ణ హీరోగా, విజయనార్మల డైరెక్షన్లో 1974లో వచ్చిన దేవదాసు ప్రహసనం తెలియని తెలుగు వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. భారతదేశంలో శరత్ రాసిన ఈ దేవదాసు నవల తీయబడినన్ని భాషల్లో ఏ నవల కూడా ఇప్పటి వరకు తెరకెక్కించి ఉండరు.
మొదటిసారిగా 1929లో ముక్తిగా కలకత్తాలో తీయబడిన ఈ సినిమా.. తర్వాత 1935లో టాకీగా తెరకెక్కింది. మళ్ళీ ఇదే నవల 2002 వరకు బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళ, అస్సామీ, మలయాళం, ఉర్దూ భాషలో తరుకెక్కింది. కృష్ణ సినిమాకు పోటీగా.. ఏఎన్నార్, సావిత్రిలు నటించిన దేవదాసు రీ రిలీజ్ చేసి వంద రోజులు సక్సెస్ఫుల్గా రన్ చేసారు. సైగల్ దిలీప్ కుమార్ అంతటి మహానటులు కూడా అక్కినేనిలా నటించలేకపోయారని అప్పట్లో ఆయన పేరు మారుమోగిపోయేది. కొన్ని పాత్రలు కొంతమంది కోసమే పుడతాయేమో అనిపించేలా.. దేవదాసు, సావిత్రి పాత్రల్లో నాగేశ్వరరావు, సావిత్రి లీనమైపోయి నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అయితే అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆ దేవదాసు ఎంత గొప్ప సినిమా అయినా.. ఎంత మ్యాజిక్ చేసిన.. ఆయనకు పోటీగా కృష్ణ సినిమా తెరకెక్కించడం అంటే సాధారణ విషయం కాదు.
కృష్ఫ దేవదాసుని కూడా తీసి పడేయలేము. కృష్ణ, విజయనిర్మల తాము టేకప్ చేసిన ఈ సినిమా విషయంలో ఎన్ని అవరోధాలు వవచ్చిన ఎంతో శ్రమించి సిన్సియర్గా పూర్తి చేశారు. అందుకు వారిద్దరినీ అభినందించడంలో తప్పేమీ లేదు. రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో పాటలు కూడా శ్రావ్యంగా ఉండడమే కాదు.. మంచి పాపులారిటీ కూడా దక్కించుకున్నాయి. అయితే ఈ సినిమాను కలర్లో కాకుండా నాగేశ్వరరావు దేవదాసు లాగా బ్లాక్ అండ్ వైట్లో తీసి ఉంటే బాగుండేదేమో అని అప్పట్లో చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఏఎన్ఆర్ దేవదాసు ఎంత మంచి సక్సెస్ సాధించిన.. అలాంటి సినిమా తో పోటీపడి కూడా కృష్ణ ఓ మోస్తారు సక్సెస్ అందుకోవడం సాధారణ విషయం కాదు. ఇలా కృష్ణ తన సినిమాలు విషయంలో ఎప్పుడు సాహసాలకు వెనకాడలేదు.