టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా అడుగుపెట్టి.. మల్లేశం, బలగం సినిమాతో హీరోగా మారిపోయాడు ప్రియదర్శి. ఇతను హీరోగా నటించిన తాజా మూవీ డార్లింగ్. గత కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ధియేటర్స్‌లోకి వచ్చింది. ఇక సినిమా ఎలా ఉంది.. సినిమాతో ప్రియదర్శి హిట్ కొట్టడా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం.
ప్రియదర్శి(రాఘవా) పెళ్లి చేసుకోవడం, హనీమూన్ కి భార్యని ప్యారిస్ తీసుకువెళ్ళడం లక్ష్యంగా చిన్నపటినుంచి బ్రతుకుతూ ఉంటాడు. తల్లిదండ్రులు చూపించిన అన్నన్య నాగళ్ళతో(నందిని) పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ ఆమె ప్రేమించిన వాడితో లేచిపోతుంది. పెళ్లి బ్రేకప్ అవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా అక్కడే నభానటాషా(ఆనంది) కలుస్తుంది. పరిచయమైన ఆరు గంటల్లోనే రాఘవని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆనంది ఎవరు.. ఈమె ఒక్కో టైం లో.. ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తుంది అన్నదే కథ. ఒక మనిషి ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తించడం మల్టిపుల్ పర్సనాలిటీ డిసాడ్డర్.. ఇదే కాన్సెప్ట్ గతంలో అపరిచితుడు సినిమా తెరకెక్కింది. కాకపోతే అది ఎమోషనల్ స్టోరీ. ఇది కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
ఒకవేళ ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీ అమ్మాయికి ఉండటం వల్ల ఏమైంది అనేది డార్లింగ్ స్టోరీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ప్రమోషనల్ వీడియోస్ చూస్తే ఈ సినిమా కథేంటో అర్థం అవుతుంది. మొదటి నుంచి హీరో పెళ్లి లక్ష్యంగా పెరిగి పెద్దై.. పెళ్లికూతురు లేచిపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న క్రమంలో హీరోకి ఊహించిన పరిస్థితుల్లో వేరే అమ్మాయితో వివాహం జరుగుతుంది.. మధ్యమధ్యలో కామెడీ, సరదాగా సాగిపోయే సినిమా.. ఇంటర్వెల్ ట్విస్ట్ యావరేజ్ అనిపించింది. సెకండ్ హాఫ్‌లో భార్యకు ఎందుకు అలాంటి సమస్య వచ్చిందని తెలుసుకోవడంలో భర్త చేసే ప్రయత్నాలు కామెడీగా ఉంటాయి. చివర్లో ఎమోషనల్ గా సినిమా ఎండ్ అవుతుంది.
అయితే మొదట కామెడీగా ఉన్న సినిమా.. ఎమోషనల్ గా ఎలా ఎండ్ అయ్యింది అనేది స్టోరీ చూస్తేనే అర్థమవుతుంది. మంచి స్టోరీలైన్. అప్పటికీ డైరెక్టర్ కాస్త తడబడినట్లుగా అనిపించింది. స్ప్లిట్ పర్సనాలిటీ అంటూ కథ అంతా నవ్వించిన ఇంటర్వెల్‌కే కథ ముగిసిపోయినట్లు అనిపించింది. సినిమాలో హీరోయిన్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ పమప్య ఉందని ట్విస్ట్ ఇచ్చి మరోసారి ఇదే కాన్సెప్ట్‌తో కామెడి చేసే ప్రయత్నంచేశారు. దీంతో సెకండ్ హాఫ్ లో అది అంతగా వర్కౌట్ కాలేదు. స్టోరీ అంతే ఒకే పాయింట్ దగ్గర తిరుగుతున్నట్లుగా ఆడియన్స్ ఫీల్ అవుతారు. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి కొన్ని ఎమోషన్స్ సీన్స్ పడడంతో సూపర్ అనిపించుకోకపోయినా.. యావరేజ్ గా ఉంది అనే అభిప్రాయం ఆడియన్స్‌కు వస్తుంది. ఇక హీరోయిన్ పాత్రలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నా అవిప్రేక్షకులకు అంతగా నచ్చవు. దానికంటే ప్రియదర్శి కామెడీ, ఎమోషన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. కేవలం టైంపాస్ కోసం సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమా పర్లేదు అనిపిస్తుంది.