మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చరణ్.. శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తుది దశకు చేరుకుంది. కియారా అద్వాన్ని, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సట్స్‌పైకి వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వకుండా ఎప్పటినుంచో అభిమానులను నిరాశకు గురి చేస్తున్నాడు శంకర్. ఇదిగో అప్పుడే రిలీజ్.. ఇప్పుడే రిలీజ్ అంటూ ఏవేవో వార్తలు వస్తున్నాయి కానీ.. ఒకసారి కూడా సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. అయితే మెగా ఫ్యాన్స్ సినిమా ఎలాగైనా ఈ ఏడాదిలో వస్తుందని ఎప్పటినుంచో ఆశ పడుతున్నారు. కానీ శంకర్ దానిలో కూడా ట్విస్ట్ ఇచ్చ పెంట పెంట చేశాడు. ఇప్పుడు ఇండియన్ 2 రిలీజ్ అయిన 6 నెలల వరకు గేమ్ చేంజర్ రిలీజ్ ఉండదని తేల్చేసాడు.
దీంతో సినిమా ఈ ఏడాదిలో కాకుండా.. వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతుందని అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో శంకర్‌ను మరోసారి బండబూతులతో ఆడేసుకుంటున్నారు అభిమానులు. అనవసరంగా గేమ్ చేంజర్ పై ఉన్న ఆశక్తిని తగ్గిస్తూన్నాడంటూ.. అసలు రిలీజ్ డేట్ ఇంతగా పొడిగించాల్సిన అవసరం ఏముంది అంటూ ఫైర్ అవుతున్నారు. దీనిపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో.. ఇకనైనా సరైన రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారో లేదో వేచి చూడాలి.