మనందరికీ తెలిసిందే.. మరికొద్ది గంటల్లోనే ఏపీలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది అనే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా ఇంతకుముందు జరిగిన ఎన్నికలు వేరు .. ఈసారి జరిగిన ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేరు .. రిజల్ట్ ఎలా ఉందో చూస్తే జనాలకి కాదు రాజకీయ నేతలకు సైతం వణుకు పుట్టించేస్తుంది . మరి ముఖ్యంగా ఇన్నాళ్లు రాజ్యం వేసిన వైసిపి పార్టీ దారుణాతి దారుణంగా ఓడిపోబోతుంది. సుమారు 145 స్థానాలలో ఓటమి అధికారంలో లీడింగ్ లో కొనసాగుతుంది . ఈ క్రమంలోనే ఏపీలో కూటమి అధికారం చేపట్టబోతుంది అంటూ క్లారిటీకి వచ్చేసింది . కాబోయే సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం ఉత్సవానికి కూడా ఎవరు రావాలి అని లిస్టు కూడా రెడీ చేసేసుకున్నారు అన్న వార్త బాగా వైరల్ గా మారింది .
ఇలాంటి క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు హైలెట్గా మారింది . అందరికీ తెలిసిన విషయమే.. చంద్రబాబు శిష్యుడుగా రేవంత్ రెడ్డిని మాట్లాడుకుంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఈ విధంగా ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు తెలంగాణలో రేవంత్ రెడ్డి పేరు పాతాళానికి పడిపోతున్న మూమెంట్లో ఆయన రాజకీయ భవిష్యత్తును మలుపు తిప్పింది కూడా చంద్రబాబు నాయుడు .. కాంగ్రెస్ లోకి వెళ్ళమని చెప్పి అక్కడ అధికారం చేపట్టే విధంగా పావులు కలిపాడు. .
ఇప్పుడు ఆ రుణం రేవంత్ రెడ్డి తీర్చుకుంటాడా ..? అనే విషయం హైలెట్గా మారింది. తెలంగాణ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి త్వరలోనే సీఎం గా మారిపోతున్న నారా చంద్రబాబునాయుడుతో చేతులు కలిపితే కచ్చితంగా గురుశిష్యులు కారణంగా తెలుగు రాష్ట్రాలకు మంచి రోజులు రాబోతున్నాయి అని మంచి మంచి ప్రాజెక్ట్ ఇండియాకి తీసుకురావచ్చు అని.. తెలుగు రాష్ట్రాలలో మంచి ఉపాధి కల్పించవచ్చు అని ప్రజలు భావిస్తున్నారు . అంతేకాదు రేవంత్ రెడ్డి చంద్రబాబుతో చేతులు కలపాలి అంటూ సజెస్ట్ చేస్తున్నారు . వీళ్లిద్దరి మధ్య సీక్రెట్ ఫ్రెండ్షిప్ కూడా ఉంది అంటూ పలువురు రాజకీయ నేతలు వెటకారంగా ట్రోల్ చేశారు. ఆ సీక్రెట్ ఫ్రెండ్ షిప్ ఇప్పుడు ఉపయోగపడితే అదే ఏపీ రాజకీయ భవిష్యత్తును మలుపు తిప్పే విధంగా మారబోతుంది అంటున్నారు రాజకీయ సినీ విశ్లేషకులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???