తెలంగాణలో బీఆర్ఎస్ .. ఏపీలో వైసిపి ఓడిపోవడానికి కారణం అదే..ఆ ఒకే ఒక్క తప్పు ఇదే..!

ఎస్ ఇప్పుడు ఇదే వార్త ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. మనకు తెలిసిందే.. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది . మరి కొద్ది గంటల్లోనే విన్నింగ్ మూమెంట్ డిక్లేర్ కాబోతుంది. కాగా ఇప్పటివరకు డిక్లేర్ అయిన ఓట్ల ప్రకారం ఏపీలో కూటమి అధికారం చేపట్టబోతుంది అంటూ క్లియర్ గా తెలిసిపోతుంది. దాదాపు 140 చోట్ల ఏపీలో కూటమి ముందంజలో ఉంది . ఈ క్రమంలోని కూటమి అధికారం చేపట్టడం కన్ఫామ్ అంటూ క్లారిటీకి వచ్చేస్తుంది . అయితే ఇదే క్రమంలో దారుణాతి దారుణంగా పతనానికి గురైన వైసిపి లోని నెగిటివ్ పాయింట్స్ ట్రోల్ చేస్తున్నారు జనాలు .

అంతేకాదు ఇదేవిధంగా దారుణాతి దారుణంగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ పడిపోయింది . ఈ ఇద్దరు చేసిన తప్పు ఒకే ఒక్కటి అంటూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉండే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గుండాయిజం ఎక్కువైపోయింది ..బూతు మాటలు మరీ మరీ ఎక్కువైపోయాయి.. బాధ్యత గల మినిస్టర్ పొజిషన్లో ఉన్నాము అని చూడకుండా పలువురు మినిస్టర్స్ కొందరు ఆడవాళ్ళపై ఎలా దారుణాతి దారుణంగా వర్ణించలేని పదాజాలంతో దూషించారు .

మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని .. వైసిపి నాయకులు క్యారెక్టర్ పరంగా దెబ్బతీశారు. అదే విధంగా బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ఎలాంటి హెడ్ వెయిట్ కామెంట్స్ చేశారో కూడా అందరికీ తెలుసు . ఈ క్రమంలోనే నోటి దూకుడు కారణంగా అక్కడ తెలంగాణలో టిఆర్ఎస్ ఓడిపోతే ఇక్కడ ఏపీలో వైసిపి ఓడిపోతుంది అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి నోటి దూకుడు పనికిరాదు అన్న విషయం ఇప్పటికైనా అర్థమైతే మేలు అని పలువురు వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్స్ చేస్తున్నారు..!!