ప్రశాంత్ నీల్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం .. ఎన్టీఆర్ అభిమానులకి ఎక్కడో కాలిపోయేలా చేస్తుందే..!?

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా డైరెక్టర్ స్టార్ హీరోలతో ఎలాంటి రిస్కీ ప్రాజెక్టులను ఓకే చేయిస్తున్నారు అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా కొంతమంది హీరోలు కూడా డైరెక్టర్లను గుడ్డిగా నమ్మేస్తూ వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడిపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ప్రశాంత్ నీల్ కి సంబంధించిన ఒక వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సలార్ సినిమాతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ప్రశాంత్ నీల్ ఆగస్టులో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు .

ఈ సినిమాకి సంబంధించిన వర్క్స్ తో బిజీబిజీగా ముందుకు వెళ్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ ఇప్పుడు ఎన్టీఆర్ను చాలా క్రూరమైన లుక్స్ లు చూపించబోతున్నాడట . ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కే సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు . ఆల్మోస్ట్ ఆల్ ఇది ఫిక్స్ . యూరోపియన్ కల్చర్ లో చెడుకి సింబల్ డ్రాగన్. మైథాలజీలో ఓ రాక్షసుడు. డ్రాగన్ కి అగ్గి పీల్చే గుణం వుంటుంది. అలాగే అలజడికి సింబాలిక్ గా డ్రాగన్ ని వాడుతారు. ఇవన్నీ ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఉండేట్లు డిజైన్ చేస్తున్నారు నీల్.

ఎన్టీఆర్ టెంపర్ లో నెగిటివ్ టచ్ వుండే పాత్ర చేశారు. ఇప్పుడు మరోసారి నెగిటివ్ రోల్ కి రెడీ అవుతున్నారట. అంత పెద్ద స్టార్ హీరోని ఇలాంటి క్యారెక్టర్ లో చూపిస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది . మరీ ముఖ్యంగా ప్రశాంత్ నీల్ తన సినిమా హిట్ అవ్వడం కోసం స్టార్ హీరోని ఎంతటికైనా కష్టపడతాడు .. ఎలాంటి క్యారెక్టర్ లోనైనా చూపించడానికి డేర్ చేస్తాడు .. ఆ రిస్క్ ఎన్టీఆర్ విషయంలో తీసుకుంటే నందమూరి ఫ్యాన్స్ ఊరుకుంటారా..? అనేది కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..???