రూటు మార్చేసిన వైష్ణవి చైతన్య.. ఇకపై అలా చేయబోతుందా..?

సినిమా ఇండస్ట్రీలో అన్ని మనం అనుకున్నట్లు జరిగిపోవు .. ఊహించినవి.. ఊహించలేనివి కూడా జరుగుతూ ఉంటాయి ..ఆ విషయం పాపం ఆలస్యంగా అర్థం చేసుకుంది యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య. ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో హీరోయిన్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది . అయితే ఆ తర్వాత వచ్చిన లవ్ మీ సినిమా మాత్రం ఆమెకు భారీ దెబ్బేసింది.

దిల్ రాజు వారసుడు ఆశీష్ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన లవ మీ.. హారర్ థ్రిల్లర్ మూవీ . లవ్ మీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకుంది . అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో వైష్ణవి చైతన్య తన నెక్స్ట్ ప్లాన్ స్టార్ట్ చేయడం మార్చిందట. ఎప్పుడు లవ్ స్టోరీలే కాకుండా ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకోవాలి అంటూ ఫిక్స్ అయిందట . ఫామిలీ సెంటిమెంట్ సినిమాను కూడా చేయడానికి డిసైడ్ అయిందట.

అంతేకాదు సెకండ్ హీరోయిన్ పాత్రలు వచ్చినా కూడా చేయడానికి ఓకే చెప్పేస్తుందట.. అయితే బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యకు సెకండ్ హీరోయిన్ గా చాలా ఆఫర్లు వచ్చిన కెరియర్ స్పాయిల్ అయిపోతుందేమో అన్న భయంతో ఆమె రిజెక్ట్ చేసిందట . ఫైనల్లీ లవ్ మీ సినిమా ఇచ్చిన గుణపాఠంతో ఆఖరికి సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయడానికి కూడా వైష్ణవి ఓకే చేసిందట. చూద్దాం మరి వైష్ణవి చైతన్య ఎలాంటి హిట్స్ అందుకుంటుందో..?