ఆ విషయంలో బాలయ్యను బాగా బలవంతం చేస్తున్నారా ..? వద్దు వద్దు అన్న వినట్లేదా..?

బాలయ్య ..నచ్చితేనే ఏ పనైనా చేస్తాడు ..నచ్చకపోతే రెండుసార్లు చెప్పి చూస్తాడు .. మూడోసారి లాగిపెట్టి కొడతాడు ..బాలయ్య కోపం గురించి బాలయ్య ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాలా .. మంచి పని చేస్తే శభాష్ అని చెడ్డ పని చేస్తే నా కొడకా అంటూ తాట తీసే వాడే బాలయ్య.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు బాలయ్య . కానీ ఎప్పుడూ కూడా ఎవరిపై సీరియస్ అవ్వలేదు. తాజాగా బాలయ్య కు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది .

ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిటీ అయినా బాలయ్య ఆ తర్వాత బోయపాటి శ్రీను తో మరొక సినిమాకి కమిట్ అయ్యాడు . అఖంద 2 కి సీక్వెల్ గా ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే బాలయ్యను ఒక ప్రముఖ ఓటిటి సంస్థ వెబ్ సిరీస్ లో నటించమంటూ తెగ బలవంతం చేస్తుందట. ఇప్పటివరకు బాలయ్య ఒక్క వెబ్ సిరీస్ లో కూడా నటించలేదు . బాలయ్య లాంటి స్టార్ హీరో వెబ్ సిరీస్ లో నటిస్తే ఓటీటి రేంజ్ ఏ విధంగా మారిపోతుందో అనేది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .

అయితే మొదటి నుంచి వెబ్ సిరీస్ లపై పెద్దగా ఇంట్రెస్ట్ లేని బాలయ్య అలాంటి ఆఫర్స్ వస్తున్న రిజెక్ట్ చేస్తూ వచ్చారట . కానీ ఈసారి మాత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ ఒక బిగ్ బడా మెసేజ్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ లో బాలయ్యను చూపించడానికి ఎక్కువగా ట్రై చేస్తుందట . అయితే బాలయ్య మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదు వద్దు వద్దు అంటూ చెప్పుకు వస్తున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు తెలుగు సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది..!!