ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్గా రూ.5 ఆఫర్.. రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణం ఏంటంటే..?!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా అనుష్క భారీ క్రేజ్‌తో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సినిమాల్లో కనిపించకపోయినా ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఏ కొంచెం కూడా తగ్గలేదు. సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా తర్వాత అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ క‌ట్టాయి. స్టార్ హీరోల అందరి సరస‌న‌ నటించే ఛాన్సులు కొట్టేస్తూ దూసుకుపోయింది. తెర‌పై తన గ్లామర్ పాత్రలతో అదరగొట్టిన ఈ అమ్మడు.. అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని దక్కించుకుంది.

Miss Shetty Mr Polishetty (2023) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ తో బాహుబలి సినిమాలో కనిపించి ఆకట్టుకుంది. బాహుబలి తో పాన్ ఇండియా ఇమేజ్‌ దక్కించుకున్న అనుష్క బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారుతుందని అంత భావించారు. అయితే ఈ అమ్మడు ఆ సినిమా తర్వాత చాలా కాలం వరకు ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇక ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించింది. ఈ సినిమాలో నవీన్ పోలీశెట్టి హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

Krish and Anushka film on Cards

ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలను దక్కించుకొని కమర్షియల్ హిట్గా నిలిచింది. ఇక ప్రస్తుతం అనుష్క‌.. కృష్‌ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తుంది. ఈ క్ర‌మంలో ఓ భారీ బడ్జెట్ మూవీలో స్టార్ హీరో సరస‌న అనుష్కను హీరోయిన్గా సెలెక్ట్ చేశారని.. అయితే ఆఫర్‌ను ఈ అమ్మడు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కు ఇంపార్టెన్స్ లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌కు నో చేప్పేసిందట అనుష్క. ఏకంగా ఐదు కోట్ల వరకు రెమ్యున‌రెషన్ ఇస్తామన్నా అనుష్క ఆ ప్రాజెక్టులు చేసేందుకు ఒప్పుకోలేదని.. న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారింది.