ఈ బూరి బుగ్గల చిన్నది.. ఇప్పుడు వయ్యారాల చందమామ.. ఎవరో గుర్తుపట్టారా..?!

టాలీవుడ్ లో అడుగు పెట్టి న‌టించింది అతి తక్కువ సినిమాలైనా.. తెలుగు రాష్ట్రాల్లో కుర్రాళ‌ను మాయ చేసింది ఈ చిన్నది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ అమ్మడు.. నటనతో పాటు అందంతోను ప్రేక్షకులను మెప్పించింది. తొలి సినిమాతోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. అందమంతా అమ్మాయిగా పోగేస్తే ఇలా ఉంటుందా అన్నట్లుగా మెరిసే ఈ చిన్నది.. కలువ కళ్ళతో చూడగానే కట్టిపడేసే చందమామ లాంటి ముఖంతో మెరిసిపోతుంది. అందం కూడా అసూయపడేంత వయ్యారంగా అందాలు ఆరబోసే ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టగలరా..?

కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ మత్తెక్కించే క్యూట్ ఫొటోస్

ఈ పై ఫోటోలో చిలిపి నవ్వు చిందిస్తున‌ బూరి బుగ్గల బుజ్జాయి.. కన్నడ సోయగం. చివరిగా అక్కినేని అందగాడు నాగార్జునతో కలిసి ఓ సినిమాలో అదరగొట్టింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాకు పాజిటివ్ టాక్ తో పాటు అదరగొట్టే రెస్పాన్స్ వచ్చింది. కాని క‌లక్షన్ల పరంగా లాభాలు రాబ‌ట్ట‌లేక‌పోయింది. అయితే ఈ ముద్దుగుమ్మకు మాత్రం మూవీ మరింత ప్లస్ అయింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. ఎస్ ఆమె కన్నడ సోయగం ఆశిక రంగనాథ్. ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి విశ్వంభ‌ర లో ఓకీల‌క‌ పాత్రలో నటిస్తుంది.

Vishwambhara': Ashika Ranganath joins cast of Chiranjeevi's next with  Vassishta - The Hindu

మొదట అమీగోస్‌ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక‌ అమీగోస్‌ సినిమాతో ఆశికకు మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. అయితే ఈ క్రమంలో ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టిన‌ తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే నటించే ఈ అమ్మ‌డు ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. అయితే చాలా గ్యాప్ తర్వాత మరోసారి నాగార్జున నా స్వామి రంగా సినిమాలో నటించి హిట్ త‌న ఖాతాలో బేసుకుంది. ఇక తాజాగా విశ్వంభ‌రతో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు ఆషిక.. కన్నడలోను మరో రెండు సినిమాల్లో బిజీగా గడుపుతుంది. వీటితో పాట టాలీవుడ్ లో కొన్ని ఆఫర్స్ క్యూ క‌డుతున్నాయని సమాచారం.