ఇట్స్ అఫిషియల్: హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలీల.. అందరు అనుకున్నదే నిజమైందిగా..!

ఎస్ ఫైనల్లీ.. శ్రీలీల గురించి ఏ రూమర్ అయితే వైరల్ అయిందో అదే రూమర్ నిజమైంది . అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్కి గురైంది. అది ఎంతలా అంటే ఆమె పేరు చెప్తే జనాలు మండి పడిపోయారు. అంతలా హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ కి గురైంది. రీసెంట్ గా ఆమెకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అయింది. అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హను రాఘవపూడి డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతుంది అంటూ తెగ ప్రచారం జరిగింది.

అయితే హనురాఘవపూడి డైరెక్షన్లో శ్రీ లీల నటిస్తున్న విషయం నిజమే కానీ అది సినిమా కాదు ఒక యాడ్ కోసం అంటూ బయటపడింది. తాజాగా దానికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది . సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు హను రాఘవపూడి. ఆయన సినిమాలన్నీ కూడా అంతే క్లాసిక్ గా ఉంటాయి. తాజాగా శ్రీ లీల పల్లెటూరి అమ్మాయిల చూపించారు . ఈ పిక్స్ లో శ్రీలీల చాలా ముద్దుగా ఉంది.

 

శ్రీ లీల ఈ ఫోటోలు షేర్ చేస్తూ .. “రేట్రో షీట్స్ ని హత్తుకున్నాను ఒక నటిగా డిఫరెంట్ లుక్స్ ప్లే చేయడం ఆనందంగా ఉంది ..నాకు నేనే చాలా కొత్తగా కనిపించాను .. అయితే ఇది ఒక యాడ్ షూటింగ్ కోసం మాత్రమే “అంటూ హనురాగవపుడికి థాంక్స్ చెప్తూ ఆయనకు సంబంధించిన పిక్చర్స్ పోస్ట్ చేసింది. ఆమె పిక్చర్స్ వైరల్ గా మారాయి. అయితే ఆ యాడ్ ఏంటో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..!!

 

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)