అమ్మ బాబోయ్ .. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ నెలకు అంత జీతం తీసుకోబోతున్నాడా..?

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా తీసుకుపోయే జీతంకి సంబంధించిన వార్తలు ఏపీ రాజకీయాలలో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది . ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ..? గెలవడా..? అని చాలా టెన్షన్ పడిపోయారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . పలు సర్వేలలో పవన్ కళ్యాణ్ గెలుస్తారు అంటూ ధీమాగా చెప్పుకొచ్చిన అరా కోరా జనాలలో భయం మాత్రం ఉండేది. ఫైనల్లీ ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ ని భారీ స్థాయిలో భారీ మెజారిటీతో గెలిపించారు పవన్ అభిమానులు ..జనాలు .

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది . ఏపీ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ గా మారిపోయాడు పవన్ కళ్యాణ్ అంటూ ప్రశంసలతో ముంచేత్తుతున్నారు అభిమానులు ..జనాలు ..పలువురు పొలిటిషియన్స్ ..సినీ పెద్దలు . కాగా ఎమ్మెల్యేగా నేను జీతం తీసుకుంటాను అని చెప్పి షాక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అప్పుడే నాకు బాధ్యత ఉంటుంది అని జనాలు నన్ను నిలదీసే హక్కు కూడా వాళ్ళకి ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

దీంతో పవన్ కళ్యాణ్ అసలు ఎమ్మెల్యేగా జీతం ఎంత తీసుకోబోతున్నాడు అనే విషయం ఇంట్రెస్టింగ్గా మారింది . పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా మూడు లక్షల 50 వేలకు పైగానే జీతం తీసుకోబోతున్నారట . అంతేకాదు ఇప్పటివరకు హైయెస్ట్ గా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంది తెలంగాణకు సంబంధించిన వాళ్లు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ జీతం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి ఒక్క సినిమా చేస్తేనే ఆయనకి కోట్లు అకౌంట్ లో పడతాయి.. ఈ జీతం ఆయన రేంజ్ కి తక్కువే అంటున్నారు ఫ్యాన్స్..!!