70 ప్లస్ లోను చంద్రబాబు నాయుడు ..ఇంత ఎనర్జిటిక్ గా ఉండడానికి కారణం ఆ రెండేనా..?

ఈ మధ్యకాలంలో చిన్న ఏజ్ లోనే డయాబెటిస్ రావడం.. బీపీలు వచ్చేయడం ..హార్ట్ ఎటాక్స్ రావడం లాంటివి చూస్తున్నాము. మరీ ముఖ్యంగా 25 ఏళ్లు దాటితేనే రోగాలు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. అయితే 74 వేల వయసులోనూ చాలాఫిట్ గా ఉన్న చంద్రబాబును చూసి చాలామంది ఆయన ఫుడ్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నారు . మరి కొద్ది రోజుల్లోనే ఏపీ సీఎం గా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబునాయుడు కి 74 ఏళ్లు అయినా సరే చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు . ఆయన పని ఆయన చేసుకుంటారు . దీంతో ఆయన ఇంత ఎనర్జిటిక్ గా ఉండడానికి కారణం ఏంటా అంటూ సోషల్ మీడియాలో ఆయన ఫుడ్ డైట్ ని సెర్చ్ చేస్తున్నారు అభిమానులు .

ఈ క్రమంలోనే గతంలో ఆయన మాట్లాడిన ఓ ఇంటర్వ్యూలోని విషయాలు బయటపడ్డాయి . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తాను ఇంత ఫిట్టుగా ఉండడానికి ఏం చేస్తాను అనే విషయాలను బయట పెట్టాడు . అదే న్యూస్ ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతుంది. చంద్రబాబునాయుడు హెల్త్ పట్ల చాలా కాన్షియస్ గా ఉంటారట. ఏది పడితే అది తినడట . ఏం తింటున్నాం..? ఎంత తింటున్నాం..? ఎన్ని క్యాలరీస్ తింటున్నాం ..? ఎన్ని క్యాలరీజ్ ఖర్చు చేయాలి..? ఏది తింటే ఉపయోగం ఏంటి..? అనే విషయాలను తెలుసుకొని తింటాడట చంద్రబాబు నాయుడు.

ఆయన ఫుడ్ డైట్ చాలా సింపుల్ గా ఉంటుందట. ఉదయం రెండు ఇడ్లీ లేదా రెండు దోస లేదా ఉప్మా రవ్వ ..ఓట్స్ ఉప్మా ..రాగి దోస ..రాగి ఇడ్లీ ..కొంచెం చట్నీ అంతే ….ఆ తర్వాత ఒక ఫ్రూట్ ఆ తర్వాత మధ్యాహ్నం రాగి సంగటి లేదంటే ఒక కప్పు అన్నం పెరుగు రెండు రకాల కూరలు అంతే ..సాయంత్రం నట్స్ లేదా మిల్క్ షేక్ లేదా జ్యూస్ అంతే.. రాత్రికి ఒక గ్లాస్ పాలు తాగి పడుకుంటారట . అంతే కాదు డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవి కూడా ఎక్కువగా తీసుకోరట ..మరి ముఖ్యంగా హెల్త్ పట్ల చాలా కాన్షియస్ గా ఉంటూ మార్నింగ్ నైట్ వాక్ కూడా చేస్తారట . ఆ కారణంగానే 74 ప్లస్ లోను ఇంత ఎనర్జిటిక్ గా ఉన్నాడు చంద్రబాబు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు అభిమానులు..!!