ఒకవేళ ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే .. ఆయన ఆస్తులు మొత్తం ఎవరికీ వెళ్తాయో తెలుసా..?

ప్రభాస్ ..టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ..ఆరడుగుల అందగాడు ..అద్దిరిపోయే కటౌట్ కానీ ఏం లాభం పెళ్లి మాత్రం చేసుకోను అంటున్నాడు .. అలానే ఎప్పటికి పెళ్లి చేసుకోను అంటున్నాడా..? అంటే కాదు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు ..కానీ ఎప్పుడు చేసుకుంటాడో..? ఎవరిని చేసుకుంటాడో ..? మాత్రం చెప్పడం లేదు . పోనీ పెళ్లి వయసు ఇంకా రాలేదా ..? అనుకుంటే ఆ పెళ్లి వయసు వచ్చి ఎప్పుడో దాటేసింది . దీనితో సోషల్ మీడియాలో రెబెల్ ఫాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు .

సినిమాలు కాదయ్యా బాబు ముందు పెళ్లి చేసుకో అంటూ ఘాటుగానే ఇస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఒకవేళ ప్రభాస్ సెకండ్ ఆప్షన్ కింద పెళ్లి చేసుకోకుండా అలాగే మిగిలిపోతే ఆయన సంపాదించిన ఆస్తి ఎవరికి వెళ్తుంది ..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ ఒక్కొక్క సినిమాకి 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఎన్నెన్నో కోట్ల ఆస్తి ఉంది ..లగ్జరీ బంగ్లాలు ఉన్నాయి ..కార్లు ఉన్నాయి .

ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఆస్తి ఎవరికి దక్కాలి.. ఎవరికీ దక్కుతుంది..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే ప్రభాస్కి ప్రబోద్ – ప్రగతి అనే బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు . వాళ్లకే దక్కుతుంది అంటూ కొంతమంది చెప్పుకొస్తున్నారు. మొత్తానికి సగం మంది రెబల్ ఫ్యాన్స్ ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అన్న అసలు కూడా వదిలేశారు.. సోషల్ మీడియాలో ఇదిగో ప్రభాస్ పెళ్లి అదిగో ప్రభాస్ ముహూర్తం అంటున్నారు తప్పిస్తే ఎక్కడ అఫీషియల్ ప్రకటన మాత్రం రావడం లేదు..!!