ప్రభాస్ “కల్కి” కి అదే బిగ్ మైనస్ కాబోతుందా..? కొంప ముంచేశావ్ గా నాగ్ అశ్వీన్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తాజాగా నటించిన సినిమా కల్కి. మహానటి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . అయితే ఈ ట్రైలర్ కొందరిని ఆకట్టుకుంటే మరికొందరిని మాత్రం డిసప్పాయింట్ చేసింది. మరీ ముఖ్యంగా తెలుగు జనాలకు నచ్చే విధంగా ఈ సినిమా కాన్సెప్ట్ లేకపోవడం గమనార్హం .

ప్రభాస్ ని ఇప్పటివరకు చూసిన సినిమాలలో వేరు ..ఇప్పుడు ఈ సినిమాలో చూసే విధానం వేరు అనే విషయం అందరికీ తెలిసిన .. ఈ సినిమా కాన్సెప్ట్ ఏదో డిఫరెంట్ గా ఉంది. మరీ ముఖ్యంగా హాలీవుడ్ జనాలను మెప్పించడానికి తీసిన మూవీ గాని అనిపిస్తుంది కానీ ఎక్కడ తెలుగు జనాలను దృష్టిలో పెట్టుకొని నాగ్ అశ్వీన్ ఈ సినిమా ను తెరకెక్కించాడు అని జనాలు భావించలేకపోతున్నారు . మరీ ముఖ్యంగా దీపికా పదుకొనే – దిశా పటానిల లుక్స్ ఏదో విధంగా అనుకుంటే మరొక విధంగా చూపించాడు నాగ్ అశ్వీన్.

అంతేకాదు .. సినిమాలో భారీ క్యాస్ట్ అండ్ క్రూ కూడా ఈ సినిమాకు నెగిటివ్గా మారిపోతుంది అంటున్నారు. జనరల్ గా స్టార్ హీరో సినిమా అంటే ఒకరో ఇద్దరో స్టార్స్ ఉండాలి . కానీ సినిమా మొత్తం స్టార్స్ ని పెట్టేసాడు నాగ్ అశ్వీన్. అదే సినిమాకి మెయిన్ డ్రా బ్యాక్ కాబోతుంది అంటున్నారు . పైగా కథ కూడా తెలుగు జనాలకు ఏమాత్రం నచ్చుతుందో ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు.. రెబల్ ఫ్యాన్స్ ఎలా ఉన్నా సినిమాని హిట్ చేస్తారు ..టాక్ ప్రకారం బాగా రావాలి అంటే తెలుగు జనాలకు నచ్చాలి .. చూద్దాం మరి ఏం చేస్తాడో ఈ నాగ్ అశ్వీన్.. జూన్ 27వ తేదీ ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకోబోతుందో..??