నూడిల్స్ ఇష్టంగా తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే.. మళ్లీ వాటి జోలికి పోరు.. !!

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో నూడిల్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నూడిల్స్ బండి కనబడింది అంటే చాలు.. ప్లేట్లకు ప్లేట్లు లాగిస్తూ ఉంటారు. అంతేకాదు ఎక్కడికైనా వెళ్లిన తొందరగా అయిపోతుందని నూడిల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. లంచ్ బాక్స్ లో కూడా ఎక్కువగా ఇటీవల కాలంలో అవే కనిపిస్తున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ఇన్స్టంట్ నూడిల్స్ ట్రెండ్ తెగ నడుస్తోంది. త్వరగా తయారు చేసేయొచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది.. వెంట క్యారీ చేస్తూ ఆకలేసినప్పుడు తినేయొచ్చు అనే ఉద్దేశంతో నూడిల్స్ చేసి ఆఫీసుల్లో, బస్సుల్లో తినడానికి తీసుకువెళ్తున్నారు.

Egg-Fried Noodles

లొట్టలు వేసుకుంటే నూడిల్స్ లాగించేస్తున్నారు. అయితే అది సేఫ్ అయిన ఫుడా.. కాదా.. అనే విషయాన్ని మాత్రం ఎవరు ఆలోచించడం లేదు. చిన్నారులు మారం చేసిన సరే నూడిల్స్ చేసి పెడితా కామ్‌గా ఉంటే అంటూ చెప్తున్నారు. వారు కూడా నూడిల్స్ కు అలవాటు పడి అమ్మ‌లు చెప్పిందే వింటూ చక్కగా ఆడుకుంటారు. అయితే ఆ నూడిల్స్ వల్లే పిల్లల ఆరోగ్యం బాగా దెబ్బతింటుందని చెబుతున్నారు నిపుణులు. పెద్దవారి నుంచి చిన్న వారి వరకు ప్రతి ఒక్కరు ఇన్స్టెంట్ నూడిల్స్ కు అలవాటు పడటంపై జరిగే పరిణామాలను హెచ్చరిస్తున్నారు. రుచి కోసం సోడియం ఎక్కువగా కలుపుతారని.. వాటిని తినడం వల్ల రక్తపోటు, గుండె సమస్యలు ప్రమాదం పెరిగి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు.

Is eating instant noodles for breakfast harmful? - VnExpress International

క్యాలరీలు ఎక్కువగా ఉండి ప్రోటీన్, విటమిన్, మినరల్స్ శరీరానికి అవసరమైన పోషకాలు ఏది అందులో సమృద్ధిగా లభించకపోవడంతో పోషక లోపాలు తలెత్తి అనారోగ్యానికి దారి తీసే సమస్య ఉంది. నూడిల్స్ లో ఉండే ఆక్రిమాయేడ్ అనే హానికరమైన రసాయనం క్యాన్సర్ ప్రమాదానికి కారణమవుతుందని తాజా అధ్యాయనంలో తేలింది. ఇన్స్టెంట్ నూడిల్స్ లో ఫైబర్ అధికంగా ఉండే జీర్ణవ్యవస్థను దెబ్బతీసే సమస్య ఏర్పడుతుంది. దీంతో క‌డుపుబ్బరం, మ‌ల బ‌థకం, అతి సారా లాంటి తీవ్ర‌ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Instant Curry Ramen — Jun & Tonic

ఇక ప్ర‌స్తుత‌ కాలంలో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య అధిక బరువు. ఈ సమస్య పెరగడమే గాని తగ్గడానికి దారులు కనిపించడం లేదు. దీనికి కారణం కూర్చొని జాబ్ చేస్తూ ఇన్స్టెంట్ ఫుడ్, ప్యాకేజింగ్ ఆహారాలను తింటూ లైఫ్ లీడ్ చేయడం. దీంతో క్యాలరీలు పెరగడంతో అధిక బరువు బారిన పడి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. తర్వాత తగ్గేందుకు ఎన్నో రెమెడీస్ పాటిస్తూ నాన్నా తంటాలు తెచ్చుకుంటున్నారు. అయితే నూడిల్స్ అధిక బరువుకు కారణం అవుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఎంత తక్కువ తీసుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతాయని వెల్ల‌డైంది.