ఆ స్టార్ హీరో కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంత పెద్ద త్యాగం చేస్తాడా..? ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..?

త్రివిక్రమ్ శ్రీనివాసరావు – పవన్ కళ్యాణ్ కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాదు ..టోటల్ బాడీనే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అవుతాడు పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఎప్పటినుంచో వినిపిస్తూ ఉన్నాయి . అంతేకాదు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు జాన్ జిగిడి దోస్తులు అంటూ కూడా జనాలు భావిస్తూ ఉంటారు. ఇద్దరు ఎవరికీ చెప్పకుండా ఏ పని చేయరు . రీసెంట్గా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. త్వరలోనే మినిస్టర్ గా మన ముందుకు రాబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .

ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు త్రివిక్రమ్ ఫ్యాన్స్ కు కొత్త డౌట్లు వచ్చాయి . అల్లు అర్జున్తో నెక్స్ట్ సినిమాకి ఫిక్స్ అయ్యాడు త్రివిక్రమ్ . అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు ఏ రేంజ్ లో వార్ జరుగుతుందో తెలిసిందే. వైసిపి కాండిడేట్ కు బన్నీ సపోర్ట్ చేయడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు బన్నీతో సినిమా చేస్తే పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

పవన్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తనకు హిట్ ఇచ్చిన హీరో ని వదిలేస్తాడా ..? అంటూ మరొక పక్క జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు . దీంతో సిచువేషన్ ఫుల్ టఫ్ గా మారిపోయింది. ఏం చేస్తాడో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటూ ఫ్యాన్స్ బుర్ర పీక్కుంటున్నారు. మాటల మాంత్రికుడు కదా ..ఏదైనా చేయొచ్చు.. ఏం మాయ అయినా చెయ్యొచ్చు అంటున్నారు అభిమానులు ..చూద్దాం మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడతాడో..??