ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. రాజమౌళి అడిగినా కూడా మహేష్ బాబు ఆ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ఫిక్స్ అయింది . ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే సినిమా కోసం మాత్రం రాజమౌళి చాలా చాలా కష్టపడుతున్నాడు.
దాదాపు 6 నెలల పైనుంచి మహేష్ బాబు లుక్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు . కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి రాజమౌళి ఈ సినిమాలో నమ్రత శిరోద్కర్ ను ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం అప్రోచ్ అయ్యారట . మహేష్ బాబు పర్మిషన్ తోనే ఇలా చేశారట. కానీ మహేష్ బాబు దానికి ఒప్పుకోలేదట . నమ్రత శిరోద్కర్ ఇకపై తెర మీద కనిపించడం అనేది జరగదు .. అది ఏ హీరో సినిమాలోనైనా సరే అంటూ తేల్చి చెప్పేసాడట .
ఒకటికి మూడు సార్లు అడిగినా సరే రాజమౌళి మాటలను ఏమాత్రం కేర్ చేయలేదట మహేష్ బాబు . ఈ విషయం ఇప్పుడు సినీవర్గాలల్లో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ న్యూస్ ని బాగా వైరల్ చేస్తున్నారు కొందరు జనాలు . రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ అడిగిన నీ మూర్ఖత్వం వదలవా ..? నమ్రతను తెరపై ఒక్కసారి నటింప చేయొచ్చుగా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!