అయ్యయ్యో..మళ్లీ చిక్కులో ఇరుకున్న హేమ.. సెన్సేషనల్ పిక్స్ వైరల్..!

హేమ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది నటి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది . హేమ నటించిన సినిమాలు చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హీరోయిన్ కి తల్లిగా సినిమాలలో అక్కగా .. ఆంటీ పాత్రల్లో బాగా నటించి మెప్పించింది. అయితే ఎప్పుడు చాలా రిజర్వ్డ్ గా తన పని తాను చూసుకునే హేమ ఈసారి ఊహించని చిక్కుల్లో ఇరుక్కుంది .. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఇష్యూలో హేమ పేరు హైలెట్గా మారింది .

ఈ రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్లు డ్రగ్స్ తీసుకున్నట్లు కన్నడ పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది . ఈ క్రమంలోనే ఆమెపై పోలీస్ కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. తాను ఏ తప్పు చేయలేదు అని హేమ బెయిల్ పిటిషన్ పై బయటకు వచ్చింది. అయితే ఇక మ్యాటర్ క్లోజ్ .. హేమ లైఫ్ సెటిల్ అంటూ అంతా అనుకున్నారు . కానీ ఎవరు ఊహించిన విధంగా హేమకు సంబంధించిన కొన్ని సెన్సేషనల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

ఆ ఫొటోస్ లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన డీజే సిద్ధార్ధ్ కూడా ఉండడం గమనార్హం. డ్రగ్స్ తీసుకుంది అంటూ రిమాండ్ కు తరలించిన హేమ .. ఆ డ్రగ్ డీలర్ డిజె సిద్ధార్ధ్ తో ఫోటో దిగడం ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చింది . ఈ ఫోటో అసలు ఎలా లీక్ అయింది .. ఎవరు లీక్ చేశారు.. కావాలని హేమని చిక్కుల్లో ఇరిక్కించడానికి చూస్తున్నారా ..? అనే విధంగా జనాలు మాట్లాడుకుంటున్నారు.. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!!