ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు . గలగల చకచగా మాట్లాడుతూనే ఉంటుంది. సుమ యాంకరింగ్ లేనిదే తెలుగు జనాలు అల్లాడిపోతారు . ఇది చెప్పుకోవడంలో ఆశ్చర్యమే లేదు .. ఖచ్చితంగా సుమ యాంకరింగ్ చూస్తేనే రోజు గడుస్తుంది అనుకోని మహిళలు కూడా ఉన్నారు. కాగా సుమ ఈటీవీలో పలు షోస్ ఈవెంట్స్ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. బాగా కూడా సంపాదిస్తుంది. మరి ముఖ్యంగా సుమ అడ్డ షో.. ఇకపై శనివారం కాకుండా ప్రతి మంగళవారం ప్రసారం కాబోతుంది.
రీసెంట్గా ఈ మార్పులు .. చేర్పుల గురించి ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఫుల్ కామెడీతో పెంచేస్తూ .. సుమ తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది . అయితే ఇప్పుడు ఈ షోలో రిలీజ్ చేసిన ప్రోమో హైలెట్ గా మారింది. సుమ ఆంజనేయ స్వామికి పూజలు చేస్తూ కోరికలు కోరుతూ ఉంటుంది . అప్పుడు ఆమె చెప్పే డైలాగ్స్ హైలెట్ గా మారుతాయి. స్వామివారు సుమని ఏంటమ్మా నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర కదా ఉండాల్సింది అని అడుగుతారు ..అప్పుడు సుమ మీ దయతో మంగళవారం ఎంటర్టైన్మెంట్ అందిద్దామనుకుంటున్న స్వామి అంటూ చెబుతుంది. తధాస్తు అంటాడు ఆంజనేయస్వామి .
అంతేకాదు స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ సెలబ్రేషన్స్ అన్ని నాకే వచ్చేలా చూడండి అని అడుగుతుంది . అప్పుడే స్వామి నా చేతుల్లో ఏముందమ్మ అని అడగ్గా..సుమ “గధ” అని పంచ్ విసురుతుంది. దాంతో స్వామివారు అది ఇచ్చుకొని కొడతా అంటూ వార్నింగ్ ఇస్తారు. చాలా చాలా సరదాగా సాగిపోతుంది ఈ ప్రోమో .. ఈ క్రమంలోనే సుమ – వైష్ణవి చైతన్యను ప్రశ్నిస్తూ .. దయ్యాలు ఎందుకు నైట్ టైం మాత్రమే తిరుగుతాయి ” అంటూ ఫన్నీగా అడుగుతుంది . దీనికి వైష్ణవి పగలంతా షోలు .. ఈవెంట్స్ చేసి బిజీ బిజీగా ఉంటాయిగా అంటుంది అంటే పరోక్షకంగా సుమకి కౌంటర్ వేసింది వైష్ణవి అని జనాలు భావిస్తున్నారు . అంతేకాదు ఈ సుమకి డబ్బు పిచ్చి అని ఎప్పుడు షోలు షోలు అంటూ తిరుగుతుంది అని ట్రోల్ చేసే జనాలు కూడా ఉన్నారు. కానీ సుమదేవి పట్టించుకోదు తన పని తాను చూసుకో పోతుంది..!!