చిరంజీవి కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో.. ఫ్రెండ్ షిప్ అంటే ఇదే రా మావ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం గురించి మనం డైలీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీ అనగానే అందరికీ ప్రముఖంగా వినిపించే మొదటి పేరు చిరంజీవినే. ఇండస్ట్రీకి ఆయన పెద్దదిక్కుగా ఉండను అంటారు.. కానీ జనాలు మాత్రం ఆయనే పెద్దదిక్కు అంటూ డిసైడ్ అయిపోయారు . చాలా సందర్భాలలో పెద్ద మనుషుల కన్నా పెద్ద వ్యక్తిగా బిహేవ్ చేశాడు చిరంజీవి . ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఏ స్థాయిలో కష్టపడుతున్నాడు అన్న విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు .

ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఒక కథను నమ్మి కమిటీ అయ్యాడు అంటే ఆ ప్రాజెక్టు కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు.. అంత కమిట్మెంట్ గల వ్యక్తి . కాగా రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు ఒక స్టార్ హీరో. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా ఆశిక రంగనాధ్ మరో హీరోయిన్గా నటిస్తున్న సినిమా విశ్వంభర. తాజాగా ఈ సినిమా సెట్స్ లో ఊహించని అతిధి మెరిసారు. ఆయన మరెవరో కాదు తమిళ్ స్టార్ హీరో అజిత్ .

ఎస్ విశ్వంభర సెట్స్ ని విజిట్ చేశారు అజిత్ . ఈ క్రమంలోనే ఆయనతో మెగాస్టార్ కలిసి ఫోటో దిగారు. విశ్వంభర టీం మొత్తానికి విషెస్ అందించారు. చిరంజీవి అజిత్ కాసేపు ముచ్చటించుకున్నారు . ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి . వీళ్లిద్దరూ చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం చాలా చాలా తక్కువ మందికే తెలుసు . నిజంగా ఫ్రెండ్షిప్ అంటే ఇదే అన్న విషయాన్ని ఇప్పుడు మెగా అభిమానులు బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఇలా సరదాగా సర్ప్రైజ్లు ఇచ్చేది ఫ్రెండ్సే కదా అన్న విషయాన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . మొత్తానికి విశ్వంభరకి పలువురు స్టార్స్ బాగానే సపోర్ట్ చేస్తున్నారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇలా సర్ప్రైజ్ విజిట్ చేసిన విషయం తెలిసిందే..!!