తన ఇన్స్టా వాడడం ఆపేసిన రేణు దేశాయ్.. ఆ విషయంలో బాగా హర్ట్ అయిందా.. అందుకే ఇలా చేస్తుందా..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రేణు దేశాయ్ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు నటిగా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు.. విడాకుల తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా మాత్రమే టచ్ లో ఉంటుంది. తరచు తనకు, తన కుటుంబానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకునే ఈ అమ్మడు.. ఇటీవల కాలంలో ఎక్కువగా పవర్ స్టార్ గురించి, తన పిల్లల గురించి, పెట్ డాగ్స్ ఫండ్ రైజింగ్ గురించి షేర్ చేసుకుంటూ వార్తలు వైరల్ గా మారింది.

 

ఏ విషయం అయినా రేణు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే రియాక్ట్ అవుతుందిని.. ఆమె బంధువులు, ఫ్యాన్స్ ఎవరైనా ఆమెను ప్రత్యక్షంగా సంప్రదించాలి అనుకున్న ముందుగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఆమెకు పర్సనల్ మెసేజ్ సెండ్ చేస్తారని సమాచారం. అయితే తరచూ ఏదో ఒక అప్డేట్ తో సోషల్ మీడియాలో సందడి చేసే ఈ అమ్మడు.. అప్పుడప్పుడు ఇన్‌స్టాకు కాస్త బ్రేక్ ఇవ్వాలనుకుంటుందని టాక్ వినిపిస్తోంది. రేణు దేశాయ్ వారం రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఫాలోవర్లకు, అభిమానులకు రకరకాల సందేహాలు మొదలయ్యాయి.

పవన్ కళ్యాణ్ విషయంలో ఈమె పెట్టిన పోస్టులకు ఆయన అభిమానుల నుంచి వచ్చిన విమర్శలను, అలాగే పెడ్డాప్స్ కోసం విరాళాల సమయంలో పలువురు స్పందించిన విధానం.. తనకు 3,500 కావాలంటూ రిక్వెస్ట్ చేసిన ఈ అమ్మడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే వీరు అడిగే ప్రతి ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందించింది. అయిన కొందరు పవన్ పై ఈమె చేసిన పోస్ట్ లకు వచ్చిన నెటిజ‌న్ల రియాక్షన్లను బట్టి హర్ట్ అయి ఉంటుందని.. అందుకే ఇన్‌స్టాకు బ్రేక్ ఇచ్చిందంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.