అందరి ముందే ఆ హీరోయిన్ ను అలా చేసిన బాలయ్య.. నెటింట హాట్ టాపిక్ గా బాలయ్య బిహేవియర్..?!

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోగా దూసుకుపోతున్నాడు నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. వరుస హిట్లు అందుకుంటూ.. హ్యాట్రిక్ హిట్లతో యంగ్ హీరోలకు పోటీగా దూసుకుపోతున్నసంగ‌తి తెలిసిందే. బాలయ్య రాజకీయాల్లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తున్నాడు. అయితే తాజాగా బాలకృష్ణ ఓ ఈవెంట్లో హీరోయిన్ తో ప్రవర్తించిన విధానం నెటింట వైరల్ గా మారింది. ఓ కార్యక్రమంలో హాజరైన బాలయ్య.. తన పక్కనే ఉన్న హీరోయిన్‌ను నెట్టేయ‌డంతో ఆమె పక్కనే ఉన్న మరో బ్యూటీ నేహా శెట్టి.. అంజలిని పట్టుకోవడం జరిగింది.

Balayya Pushed Anjali - మందేసి నటి అంజలిని స్టేజ్‌ పై తోసేసిన బాలయ్య బాబు.. ఇదిగో వీడియో

అయితే అంజలి పడిపోబోయి బ్యాలెన్స్ చేసుకొని స్టిఫ్ గా నుంచుంటూ ఇబ్బంది ఉన్నప్పటికీ నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాన్ని చూసిన నెటిజ‌న్స్ అంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంత పెద్ద హీరో అయ్యి ఉండి.. హీరోయిన్ తో ప్రవర్తించే విధానం అదేనా అంటూ.. స్టార్ హీరో అన్న పొగరు అలాంటి పనులు చేయిస్తుంది అంటూ ఫైర్ అవుతున్నారు.

Highlights From Gangs Of Godavari Event | cinejosh.com

అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం అది యాక్సిడెంట్లు గా జోక్‌గా చేసిన కావ‌చ్చు దాని ఎందుకు ఇంత హైలెట్ చేస్తూ బాలయ్యపై ఫోక‌స్‌ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇదంతా విశ్వక్ హీరోగా నటించిన థాంక్స్ అఫ్ గోదావరి మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళిన బాలయ్య.. అంజలితో ప్రవర్తించిన విధానం నెట్టింట వైరల్ గా మారడం.. అలాగే బాలయ్య ఈవెంట్లో వాటర్ బాటిల్ లో మద్యం సేవించినట్లు పిక్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన చేసిన పనికి నెటింట పలు విమర్శలు ఎదురవుతున్నాయి.