పుష్ప 2 సెకండ్ పాట రివ్యూ: ప్లస్ లు .. మైనస్ లు ఇవే.. జాగ్రత్త సుకుమార్..!!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప2. ఈ సినిమాపై అభిమానులు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమా విషయంలో అభిమానులు ఎక్కడ కూడా చిన్న తప్పును కూడా ఓర్చుకోవడం లేదు. ఆల్రెడీ సినిమా నుంచి క్రేజీ క్రేజీ అప్డేట్స్ ఇవ్వడం ప్రారంభించారు. పుష్ప 1 సినిమాలో పాటలు ఎంత హైలెట్గా మారాయో పుష్ప2లో కూడా అదే రేంజ్ లో హైలైట్ గా మారిపోతున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పుష్ప 2 సెకండ్ పాట వచ్చింది. శ్రేయ ఘోషాల్ తన అద్భుతమైన గాత్రంతో అల్లాడించేసింది .

“సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉన్నాడే నా సామి ” అంటూ సాగే లిరిక్స్ పాటకే హైలెట్ గా మారాయి. అంతేకాదు కొరియోగ్రఫీ కూడా ఈ సినిమాల్లో వేరే లెవెల్ లో ఉండబోతుంది అంటూ ప్రూవ్ చేసేసారు సుకుమార్ . మరీ ముఖ్యంగా సాంగ్ మధ్యలో వచ్చే ఫాస్ట్ బీట్ కి అల్లు అర్జున్ రష్మిక మందన్నా.. ఒకరిని ఒకరు హగ్ చేసుకుని నడుము తిప్పుతూ వేసిన స్టెప్ హైలెట్ గా మారిపోయింది . ఈ స్టెప్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఈ పాటకు సంబంధించి ప్లస్లు మైనస్లు కామెంట్స్ చేస్తున్నారు జనాలు.

పాట లిరిక్స్ పరంగా సూపర్ గా ఉంది. కొరియోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది , ఇక మ్యూజిక్ గురించి చెప్పనవసరం లేదు . దేవి చించిపడేసాడు ..లొకేషన్స్ కూడా బాగా సెలెక్ట్ చేసుకున్నాడు సుకుమార్ ..ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కేవలం ఒకే ఒక్కటి మైనస్ . ఈ పాట కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులకి కాస్ట్యూమ్ కి సంబంధించిన ఒక్క పిక్చర్ కూడా రిలీజ్ చేయకపోవడం అభిమానులకు ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది . నిజానికి ఇది డాన్స్ ప్రాక్టీస్ చేసే స్టెప్స్ ని వీడియోలు ఆడ్ చేశాడు సుకుమార్. ఒకవేళ రియల్ ఒరిజినల్ గెటప్ కాస్ట్యూమ్స్ కానీ ఒక్క క్లిప్ పెట్టిన పాట మరింత రేంజ్ లో ఆకట్టుకునేది అంటూ తెలుస్తుంది . సుకుమార్ నెక్స్ట్ టైమ్ అయినా అలాంటి ఒక పిక్చర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు..!!