బెంగళూరు రేవ్ పార్టీలో భారీ షాకింగ్ ట్విస్ట్: ఆ పేరు చెప్పి తప్పించుకున్న నటి హేమ..!

బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీ విషయంలో ఎలాంటి షాకింగ్ ట్విస్టులు రోజురోజుకి బయటపడుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ 100 మంది పాల్గొన్నారు అంటూ పోలీసుల విచారణలో బయటపడడం సంచలనంగా మారింది . అంతేకాదు పలువురు టాప్ పొలిటీషియన్స్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు అంటూ పోలీసుల వద్ద పక్క సమాచారం ఉంది . అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంత మంది నటీనటులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారట. కాగా అందరిలోకి హైలైట్ గా నిలిచింది నటి హేమ ఇష్యూ.

రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొనింది అంటూ కన్నడ మీడియాలో వార్తలు రాగానే ఆమె అలెర్ట్ అయ్యి నేను ఏ పార్టీలో పాల్గొనలేదు నేను హైదరాబాదులోనే ఉన్నాను అంటూ బుకాయిస్తూ ఓ వీడియో చేసింది . అయితే కన్నడ పోలీసులు మాత్రం రెడ్ హ్యాండెడ్ గా ఆమె రేవ్ పార్టీలో ఉన్న పిక్చర్స్ ను రిలీజ్ చేశారు . దీనితో హేమ అడ్డంగా బుక్ అయినట్లు అయింది. తాజాగా ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు తేల్చేశారు . దీంతో హేమ రేవ్ పార్టీలో పాల్గొనడం డ్రగ్స్ తీసుకోవడం సంచలనంగా మారింది.

అయితే ఎంతో మంది స్టార్స్ పాల్గొన్న హేమ విషయంలో మాత్రమే ఈ గజిబిజి గందరగోళం ఎందుకు నెలకొంది అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది . దీనిపై కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చేశారు అందరూ తమ ఒరిజినల్ పేర్లు చెప్పి ఈ కేసులో ఇరుక్కున్నారు అని.. నటి హేమా మాత్రం కృష్ణవేణి అనే పేరు చెప్పి ఈ రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదు అంటూ తప్పించుకోవడానికి చూసింది అని ..కన్నడ పోలీసులు తమ విచారణలో కనిపెట్టేశారు. అయితే నటి హేమ ఎందుకు కృష్ణవేణి పేరు చెప్పింది అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. మొత్తానికి నటి హేమ ఊహించని చిక్కుల్లో బాగానే ఇరుక్కుంది..!!