ఫైనల్లీ ..ఆ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోతో సినిమాకు కమిట్ అయిన రష్మిక.. జంట అదుర్స్..!

రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ ..టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ . అంతేకాదు తనదైన స్టైల్ లో అల్లాడించే బ్యూటీ.. ఎటువంటి స్టెప్స్ అయినా అవలీలగా వేసేయగలరు. ఎటువంటి రోల్స్ అయినా నటించగలరు . మరి ముఖ్యంగా డైరెక్టర్స్ అడిగిన వాటికి ఎస్ అన్న సమాధానం తప్పిస్తే నో కాదు కూడదు అన్న సమాధానం చెప్పదు . అలాంటి ఓ మంచి లక్షణాలు ఉన్న బ్యూటీ . ప్రెసెంట్ రష్మిక మందన్నా పేరు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే.

మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా కమిట్ అయిన ప్రతి ప్రాజెక్టు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉండడం గమనార్హం. కాగా ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న రష్మిక ..ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అన్న వార్త వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే . ఆగస్టులో ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది.

ఈ సినిమాకి డ్రాగన్ అంటూ నామకరణం చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాన్ని బయట పెట్టాలి ..కానీ కొన్ని కారణాల చేత సినిమా బృందం డ్రాగన్ అనే టైటిల్ రివీల్ చేయలేదు. ఆగస్టు 2024 లో ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది . ఈ సినిమాలో రష్మిక మందన్నా వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ లో కనిపించబోతుందట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ పక్కన రష్మిక అద్దిరిపోయే జోడి అంటూ పొగిడేస్తున్నారు..!!