నితిన్, సదా జంటగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన జయం ఇప్పటికీ ఎంతోమంది ఎవర్ గ్రీన్ ఫేవరెట్ మూవీ అనడంలో సందేహం లేదు. 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది, లవ్ తో పాటు ఎమోషన్, కామెడీ, యాక్షన్ అన్ని కలగలిపి ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ తేజ. ఈ సినిమాతో నితిన్ కు మాస్ హీరో ఇమేజ్ క్రియేట్ అయింది. అదే మూవీ తో సదా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆమె చెప్పిన వెల్లవయ్యా వెళ్ళు.. డైలాగ్ ఇప్పటికీ ఎంతోమంది వాడుతూనే ఉన్నారు. ఇక అప్పట్లో ఆ డైలాగ్ ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక టాలీవుడ్ మ్యాచ్ స్టార్ గోపీచంద్ ఈ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించాడు.
అయితే ఈ మూవీలో సదా.. సిస్టర్ రోల్ ప్లే చేసిన చిన్నారిని కూడా అంత ఈజీగా మర్చిపోలేము. ఎప్పుడూ అక్క వెంటే ఉంటూ అన్ని విషయాలను ఇంటికి చేరవేసే ఈ చిన్నది.. అక్షరాలను రివర్స్లో రాసి విషయాన్ని ఇతరులకు కన్వే చేస్తూ ఉండేది. ఇలా ఈ అమ్మడి క్యారెక్టర్ కూడా భారీ పాపులారిటీ దక్కించుకుంది. అయితే తాజాగా ఈమె లేటెస్ట్ పిక్స్ నెటింట మారాయి. తన సోషల్ మీడియా వేదికగా ఆమె ఫోటోలను షేర్ చేసుకుంది. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదా ఆమె యామిని శ్వేత. సదా చెల్లెలుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడికి ఇప్పుడు పెళ్ళై.. పిల్లలు కూడా ఉన్నారు.
జయం సినిమా తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టకుండా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టిన ఈ అమ్మడు.. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ వెంటనే వివాహం చేసుకుంది. ఆమె భర్త కోసం విదేశాలకు వెళ్ళి అక్కడే సెటిలైంది. ఇక సిల్వర్ స్క్రీన్ కు దూరమైన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్ లో ఉండే ప్రయత్నంలో ఉంది. అప్పుడప్పుడు తన ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.