వజ్రాలు నెక్లెస్ తో మెరిసిన ప్రియాంక.. కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..?!

భారతీయ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రియాంక చోప్రా కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీటౌన్‌లో స్టార్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా.. పిసి అనే నిక్ నేమ్ తో పాపులర్ అయింది. ఇప్పుడు హాలీవుడ్ లోనూ భారీ పాపులారిటితో దూసుకుపోతున్న ఈ అమ్మడు అమెరికన్ సింగర్ నిక్ జోన‌స్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. కాగా ఇటీవల ఓ ఈవెంట్‌లో సీపి ధరించిన వజ్రాల నెక్లెస్ హాట్ టాపిక్ గా మారింది. స్టైలిష్ లుక్ లో ఓ డైమండ్ నెక్లెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈవెంట్‌లో సందడి చేసిన అందరిలో పీసీ నెక్ల‌స్ ఎట్రాక్టివ్‌గా క‌నిపించ‌డంతో దాని కాస్ట్ ఎంతో తెలుసుకోవాలని ఆసక్తి ఆడియన్స్ లోను మొదలైంది.

ఇక ప్రియాంకా వేసుకున్న ఈ నెక్లెస్ ధర తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ నెక్లెస్ కాస్ట్ ఏంటో.. దాన్ని స్పెషాలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రఖ్యాత ఫ్యాషన్ హౌస్ బాల్గర్ 140వ వార్షికోత్సవ వేడుకలు ఇటీవ‌ల‌ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఎంతమంది స్టార్ సెలబ్రెటీస్ తో పాటు ఫ్యాషన్ డిజైనర్స్ పాల్గొని సందడి చేశారు. ఇక ఈ సెలబ్రేషన్స్ లో ప్రియాంక చోప్రా ఆ కాస్ట్లీ నెక్లెస్ ధరించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నెక్లెస్ లో 140 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయని.. దీన్ని పూర్తి చేయడానికి దాదాపు 2,800 గంట‌లు టైం పట్టిందని తెలుస్తుంది. 22 క్యారెట్ల కంటే ఎక్కువ బరువున్న వజ్రాన్ని ఏడుపియర్ ఆకారంలో కత్తిరించారు.

ఈ వజ్రాలు 61.81 క్యారెట్ల క్వాలిటీతో.. 698 బాగెడ్ డైమండ్స్ కలిపి సీనియోనాస్ త్రీ డైమెన్షనల్ వేవ్ స్ట్రక్చర్ లో కట్ చేశారు. ఇలా మొత్తం ఈ నెక్లెస్ సెట్ కలిపి 140 క్యారెట్ల బరువు ఉంటుందని తెలుస్తుంది. రూ.373 కోట్లు పైచిలుక ఉంటుందని సమాచారం. బల్గరీకి సంబంధించిన అటలియర్స్ లో ఈ నెక్లెస్ రూపొందించబడిందని.. అత్యంత విలువైన ఆభరణాలలో ఈ నెక్లెస్ కూడా ఒకటి అంటూ తెలుస్తుంది. ఈ వేడుకల్లో ప్రియాంక డెల్ కోర్‌ డిజైన్‌ క్రీమ్ కలర్, బ్లాక్ మిక్సర్ ఫ్రాక్ ధరించి ఆకట్టుకుంది. ఇమే ప్రాక్‌కు తగ్గట్టుగా ఆ న‌క్ల‌స్ అట్రాక్టివ్‌గా నిలిచింది. ఇక ఫర్హాన్ అత్తర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న.. జిలే జరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రియాంకా.