ఎన్టీఆర్ – శంకర్ కాంబోలో మిస్సయిన .. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు ఎప్పుడు ఎప్పుడు సెట్ అవుతాయి అని కళ్ళల్లో వత్తులు వేసుకుని మరి వెయిట్ చేస్తూ ఉంటారు అభిమానులు . అలాంటి ఓ కాంబోనే ఎన్టీఆర్ – కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ . వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రావాలి అంటూ జనాలు ఏ రేంజ్ లో వెయిట్ చేసారో మనకు తెలిసిందే. అయితే నిజానికి వీళ్ళ కాంబోలో ఒక సినిమా రావాల్సింది.

కానీ లాస్ట్ మినిట్లో ఆగిపోయింది. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా అపరిచితుడు . ఈ సినిమాలో హీరోయిన్ గా సదా నటించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా కోసం విక్రమ్ చాలా చాలా కష్టపడ్డాడు . అందుకే ఈ సినిమాకి గాను బోలేదు అవార్డులో అందుకున్నాడు .

ఈ సినిమాలో మొదటిగా ఎన్టీఆర్తో చేయాలి అనుకున్నాడట శంకర్ . అయితే కొన్ని కారణాల చేత ఈ ప్రాజెక్టు మిస్ అయి విక్రమ్ చేతికి వెళ్ళింది. విక్రం ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకుని స్టార్ గా మారిపోయాడు. ప్రజెంట్ ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . అక్టోబర్ 10 దసరా కానుకగా థియేటర్స్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది ..!!