తాను చేసిన సినిమాలలో చిరంజీవి రీమేక్ చేయాల్సి వస్తే.. మొదటగా చూస్ చేసుకునే మూవీ అదే..!

చిరంజీవి .. ఇండస్ట్రీలో స్టార్ హీరో ..ఇప్పటికి హీరోగా సినిమాలు చేస్తూ తన కొడుకుకి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు .. అంటే ఆయనలోని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు . మరీ ముఖ్యంగా చిరంజీవి మెగాస్టార్ అంటూ ట్యాగ్ చేయించుకోవడం అభిమానులకు ఎప్పటికీ మర్చిపోలేని విషయం . రీసెంట్ గా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన సినిమాలలో ఆయనకు బాగా నచ్చిన సినిమా మళ్లీ మళ్లీ రీమేక్ చేస్తే బాగుండు అనిపించే సినిమా తాలూకా డీటెయిల్స్ వివరించారు .

ఆయన కెరియర్లో ఆయనకు బాగా నచ్చిన సినిమా ఇప్పుడు రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకునే మూవీ మాత్రం రుద్రవీణ అంటూ చెప్పుకొచ్చారు . ఆ సినిమా ఆయనకి చాలా చాలా ఇష్టమట . అలాంటి కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కితే బాగుంటుంది అంటూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు చిరంజీవి . దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు.

మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో చాలా చాలా సస్పెన్స్ లు ఉన్నాయి అంటే చెప్పుకొచ్చాడు డైరెక్టర్. ఈ సినిమా కోసం మెగాస్టార్ బాగా కష్టపడుతున్నాడు..!!