ఎన్నో సినిమాల్లో నటించిన సమంత చేత ..అలాంటి పని చేయించిన రాజమౌళి.. లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్..!

రాజమౌళి .. కంటెంట్ క్రియేటర్.. సినిమాలను తెరకెక్కించడమే కాదు ఒక సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో కూడా బాగా తెలిసిన డైరెక్టర్ . ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న తోపైన డైరెక్టర్గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ..అంటేనే కారణం ఆయనకు వర్క్ పైన ఉన్నటువంటి డెడికేషన్. కాగా రాజమౌళి ఎంతో మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు . కానీ సమంత తో వర్క్ చేయించిన విధంగా మరి ఏ హీరోయిన్తోనే చేయించలేదట.

సమంత హీరోయిన్గా నాని హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈగ. ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అనేది చెప్పక్కర్లేదు . ఎన్నో అవార్డులు కూడా అందుకుంది . బాలీవుడ్ ఇండస్ట్రీని మడత పెట్టేసింది. ఈ సినిమా కోసం సమంత చేత ఆయన నిజంగానే ఈగతో మాట్లాడేలా చేశాడట. సినిమాలో ఆమె ఎక్స్ప్రెషన్స్ రియలిస్టిక్ గా ఉండాలి అంటే..

నిజంగానే నువ్వు ఈగతో ఫ్రెండ్షిప్ చేసి ఈగని ఇష్టపడుతున్నట్లు ఈగతో మాట్లాడుతున్నట్లు తెరపై కనిపించాలి అంటూ నెలరోజులపాటు ఒక ఈగతో మాట్లాడించేవాడట . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది. ప్రజెంట్ రాజమౌళి – మహేష్ బాబు తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. సమంత కొత్త సినిమాలకు కమిట్ అవ్వడానికి ఆలోచిస్తుంది . నాని పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ముందుకు వెళ్తున్నాడు..!!