ఆ ఒక్క నిర్ణయమే రామ్ పోతినేని కొంప ముంచేసిందా..? పెద్ద తప్పే చేశాడే..!

ఇండస్ట్రీలో హీరోగా రావడం చాలా కష్టం.. అయితే అలా వచ్చిన ప్రతి హీరో సక్సెస్ అవుతాడు అని లేదు.. కొన్నిసార్లు ఫ్లాప్ అవచ్చు . కానీ ఫస్ట్ సినిమాతో హిట్ అయి ఆ తర్వాత సినిమాలో ఫ్లాప్ అయ్యాయి అంటే మాత్రం ఆ బాధ వర్ణాతితం. అలాంటి బాధని అనుభవిస్తున్నాడు రామ్ పోతినేని. దేవదాసు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకోవచ్చు.

మరీ ముఖ్యంగా ఒకానొక టైం లో ఆయన కాకపోతే ఇండస్ట్రీకి హిట్ ఇచ్చేది ఎవరు? అన్న రేంజ్ లో మాట్లాడుకునేసారు జనాలు . సీన్ కట్ చేస్తే ఇప్పుడు రామ్ పోతినేని ని పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది . ఆయన లాస్ట్ గా నటించిన స్కంద సినిమా డిజాస్టర్ గా మారింది . ప్రెసెంట్ డబుల్ ఇస్మార్ట్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు .

ఈ సినిమా హిట్ అయిన రామ్ కెరియర్ సెట్ అవుతుంది అన్న నమ్మకం ఎవరికీ లేవు . అయితే రామ్ పోతినేని ఇలాంటి డిజాస్టర్ కామెంట్స్ అందుకోవడానికి కారణం ఆయన కెరియర్ లో చూస్ చేసుకున్న కొన్ని పనికిమాలిన సినిమాలే అంటున్నారు అభిమానులు . ముందు వెనక ఆలోచించుకోకుండా తన రేంజ్ కానీ సినిమాలను సైతం ఓకే చేసేసి నటించి ఫ్లాప్ లను ఖాతాలో వేసుకున్నాడు అని.. ఆ కారణంగానే ఇప్పుడు రాంపోతినేని నమ్మి ఏ డైరెక్టర్ అవకాశం ఇవ్వలేకపోతున్నాడు అని జనాలు మాట్లాడుకుంటున్నారు..!!