గీతా మాధురి తన కొడుకుకి తారక్ అని పేరు పెట్టడం వెనక అసలు సీక్రెట్ ఇదే..!!

సినీ ఇండస్ట్రీలో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో యాక్టర్ నందు ఒకడు. హీరో గానే కాకుండా ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలను మెప్పించి ఆకట్టుకున్న నందు.. పలు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ లో కూడా నటించాడు. ఇటీవల నందు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ పలు షోల‌కు హోస్ట్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తూ బిజీగా గ‌డుపుతున్నాడు. నందు, సింగర్ గీతామాధురి ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో మొదట పాప జన్మించగా.. తాజాగా గీతామాధురి ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. గీత మాధురి త‌న సెకెండ్‌ ప్రెగ్నెన్సీ కి సంబంధించిన ప్రతి విషయంతో పాటు.. బేబీ షవర్ వేడుకలను కూడా సోషల్ మీడియాతో షేర్ చేసుకుంది.

ఇక తనకు కుమారుడు పుట్టాడని శుభవార్తను కూడా అభిమానులతో పంచుకున్న ఆమె.. తన కుమారుడికి ధృవ తారక్ అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది. అయితే తన కొడుకు పేరులో ఎన్టీఆర్ పేరులో భాగమైన తారక్ ని కలపడంతో ఎన్టీఆర్ అభిమానులంతా సంతోషం వ్యక్తం చేశారు. అయితే తన కుమారుడి పేరులో తారక్‌కి పేరు పెట్టడం వెనుక ఉన్న స్టోరీ ఏంటో అనే విషయాన్ని ఇటీవల నందు ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఆయన మాట్లాడుతూ కొడుకు పేరులో తారక్‌ పెట్టడం వెనక పెద్ద కారణాలేవీ లేవని.. ఎన్టీఆర్ అంటే ఆయనకు మొదటి నుంచి ఇష్టం. అలాగే తారక్ లో ఉండే ఓ పాజిటివ్ వైబ్రేషన్ చాలా బాగుంటుంది. ఆపేరంటే అందుకే నాకు అంత ఇష్టం. అంతేకాదు ఈ ఏడాది అయోధ్యలో బాలరామయ్య కొలువయ్యాడు.

అలాగే మా ఇంటికి కూడా ఓ బాబు రావడం.. సాక్షాత్తు బాల రాముడే మా ఇంటికి వచ్చినట్లు మేము ఫీలవుతున్నాం. ఆ ఉద్దేశంతోనే తారక రాముడు అనే పేరు కలిసొచ్చేలా తన కొడుకుకు తారక్‌ని పేరు పెట్టాం అని వివరించాడు. నటుడుగా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని.. ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్ అంటూ నందు చెప్పుకొచ్చాడు. అలాగే తారక్ అనే పేరు పై తనకున్న ఇష్టంతోనే కొడుకుకి ఆ పేరు పెట్టానని వెల్లడించాడు. ప్రస్తుతం నందు చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా మీ కొడుకు ఎన్టీఆర్‌కు లానే పెద్ద స్టార్ అవుతాడంటూ కామెంట్లు చేస్తున్నారు.