సావిత్రి హ్యాపీగా ఉండటానికి అలాంటి పని చేసిన చిరంజీవి.. ఇన్నాళ్లకు బయటపడిన టాప్ సీక్రేట్..!

సావిత్రి .. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా.. సరే మహానటి అనగానే అందరికీ ముందుగా మదిలో తట్టే పేరే ఈ సావిత్రి. చిన్న వయసులోనే అత్యంత కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎన్ని హిట్ సినిమాలను అందించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నా కానీ ఇప్పటికీ మహానటి అనే ట్యాగ్ను ఆమెకే ఇచ్చేస్తున్నారు అభిమానులు అంటే ఆమె నటన .. ఆమె అందం .. ఆమె వాక్చాతుర్యం ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవచ్చు .

కట్టుకున్న భర్త మోసం చేయగా సంపాదించిన ఆస్తి మొత్తం పోగొట్టుకొని నిరుపేదగా కన్నుమూసిన సావిత్రీకి సంబంధించిన జీవిత విషయాలను అందరూ తెలుసుకునే విధంగా ఒక బుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహానటి సావిత్రి గురించి మరో పుస్తకం సావిత్రి క్లాసిక్స్ అనే పేరుతో కూడా విడుదలైంది . హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ లో సంజయ్ కిషోర్ రాసిన ఈ సావిత్రి క్లాసిక్ అనే బుక్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు .

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సావిత్రి గారితో ఉన్నా అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు . ఆయన మాట్లాడుతూ..” నేను సావిత్రి గారితో చేసింది రెండంటే రెండు సినిమాలు .. ఒకటి పునాదిరాళ్లు రెండవది ప్రేమ తరంగాలు.. రెండిట్లో కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఎదురయింది.. పునాదిరాళ్లు సినిమా షూటింగ్ టైం లో ఆమెను ఫస్ట్ టైం చూసాను అని చెప్పుకొచ్చాడు చిరంజీవి . అంతే కాదు అనుకోకుండా ఓ రోజు షూటింగ్ మధ్యలో వర్షం పడి ఆగిపోవడంతో ఆ సమయంలోనే సావిత్రి గారు తన డాన్స్ చేయమని కోరినట్లు చెప్పుకొచ్చారు.

సావిత్రి అడిగి అడగగానే చిరంజీవి తన వద్ద ఉన్న టేప్ రికార్డు ఓపెన్ చేసి ఇంగ్లీష్ సాంగ్ కి బాగా డాన్స్ చేసాడట. స్టెప్స్ మధ్యలో పొరపాటున కింద పడిపోయాడట. అయితే కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ స్టెప్స్ ని ఫ్లోర్ మూమెంట్స్ గా మార్చేసాడట. ఇది చూసిన సావిత్రి అభినందించి శభాష్ మంచి నటుడు అవుతావు అంటూ ప్రశంసించారట . ఈ విషయాన్ని అందరి ముందు చెప్పుకొచ్చాడు చిరంజీవి . కాగా ఈ కార్యక్రమానికి జయ సుధ, బ్రహ్మానందం, తన కెళ్ల భరణి , సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి , మురళీమోహన్ తో పాటు పలువురు ముఖ్య సినీ ప్రముఖుల కూడా హాజరు కావడం గమనార్హం..!!