ఆ విషయంలో సూర్యకు గట్టి పోటీ ఇస్తు సత్తా చాటిన జ్యోతిక.. వీడియో వైరల్..?!

సౌత్ స్టార్ సెలబ్రిటీ కపుల్ జ్యోతిక, సూర్యకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ తో ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారారు ఈ జంట. ఇక వీళ్లిద్దరూ సినీ రంగంలోనే ఉండడంతో ఫిట్నెస్ పై చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుంటే.. జ్యోతిక కోలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోని రాణిస్తుంది. ఇలాంటి క్రమంలో వీరిద్దరూ ఫిట్నెస్ కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. అయితే తాజాగా జ్యోతిక దీనికి సంబంధించిన వీడియోను.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. సూర్యతో కలిసి జిమ్లో వర్కౌట్ చేస్తూ ఆ వీడియోను అభిమానతో షేర్ చేసుకుంది. అయితే ఇందులో సూర్యతో గట్టి పోటీ పడుతూ మరి జ్యోతిక వర్కౌట్లు చేసింది.

ప్రతి వర్క్ అవుట్ ను జ్యోతిక చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ఇక తాజాగా ఈ వీడియో ఒకటి నెటింట‌ వైరల్‌గా మారడంతో అంత ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోతున్నారు. సూర్యకు గట్టి పోటీ ఇస్తూ జ్యోతిగా చేసిన ఎక్సర్సైజులు చూసి అవాకౌతున్నారు. అయితే మరి కొందరు మాత్రం ఇద్దరు సమానంగానే చేస్తున్నారు. ఇద్దరూ ఈ కాంపిటీషన్లో గెలిచారు అంటూ పర్ఫెక్ట్ కపుల్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక జ్యోతిక ఒకప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. వర్సెస్ అనుమాల్ లో నటిస్తూ బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ.. మంచి ఫామ్ లో ఉన్న టైంలో సినిమాలకు కాస్త బ్రేక‌ట్ ఇచ్చింది. ఇక తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ వరుసగా సినిమాల్లో నటిస్తుంది.

తన అందం అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇక ఇటీవల లేడిఓరియంటెడ్‌ సినిమాలతో మెప్పిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగ‌ణ్‌తో సైతాన్ సినిమాలో నటించి బాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో హిట్ కొట్టిన జ్యోతిక ప్రస్తుతం సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటుంది. అయితే సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి ఇంతకాలం అవుతున్న ఆమె అందం మాత్రం కాస్త కూడా చెక్కుచెదరలేదు. చక్కగా నాజూకుగా కనపడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జ్యోతిక ఫిట్నెస్ గా ఉండడానికి రన్నింగ్ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా నిత్యం జిమ్‌కు వెళ్లి వర్కౌట్లు, వెయిట్ లిఫ్టింగ్ లు, రోప్ ట్రైనింగ్ లాంటి కసరత్తులు చేస్తూ ఉంటుందట. ఈ విషయంలో సూర్య కూడా జ్యోతిక నే ఫాలో అవుతారని తెలుస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Jyotika (@jyotika)