ఆన్ స్క్రీన్ లో విజయ్ దేవరకొండను లాగిపెట్టి కొట్టిన మృణాల్.. ఆఫ్ స్క్రీన్ రియాక్షన్ ఇదే..

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఇటీవ‌ల‌ మూవీ ప్రీ రిలీజ్ ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ప్లే చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ చెంపఫై కొట్టే సీన్ చూస్తూ మృణాల్ చేసిన పని వైరల్‌గా మారింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ విజయ్ దేవరకొండకు బాగా కలిసొచ్చిన జోనర్ అన్న సంగ‌తి తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్‌లో హిట్ సినిమాలుగా ఉన్న పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ఖుషి ఈ జోనర్లో తెరకెక్కి మంచి స‌క్స‌స్ అందుకున్నాయి. ఫ్యామిలీ స్టార్ సైతం రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుంది. ఇక దర్శకుడు పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న రెండో సినిమా.

విజయ్ దేవరకొండ కెరీర్‌లో గీత గోవిందం అతిపెద్ద బ్లాక్ బస్టర్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ కూడా ఆడియ‌న్స్‌ను అదే రేంజ్‌లో ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ కొత్త క్యారెక్ట‌రైజేష‌న్‌తో క‌న‌బ‌డ‌నున్నాడు. ఇక మృణాల్ ఠాకూర్ గ్లామర్ ఆక‌ట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ – మృణాల్ కాంబినేషన్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలవ‌న్నునాయ‌ట‌. లవర్స్ గా, భార్యాభర్తలుగా రెండు వేరియేషన్స్‌లో మూవీ రూపొందించారు. కాగా ట్రైలర్ చివర్లో విజయ్ దేవరకొండను మృణాల్ చెంపై కొట్టే సీన్‌ ఉంది. ”కోపం తీరిపోతుందంటే నన్ను కొట్టవే బాబు” అని మృణాల్ ని విజయ్ దేవరకొండ చెప్ప‌గా.. మృణాల్ నిజంగానే చెంపపై చెళ్ళుమ‌నిపిస్తుంది.

ఈ సీన్ ఆడియన్స్‌ను బాగా ఆక‌ట్టుకుంది. ప్రీ రిలీజ్ వేడుకలో ఫ్యామిలీ స్టార్ ట్రైల‌ర్ అవుతున్న‌ పార్టిక్యూలర్ కొట్టే సీన్ వచ్చినప్పుడు మృణాల్ నవ్వు కంట్రోల్ చేసుకోలేక‌పోయింది. ట్రైలర్ చూస్తూ విజయ్ దేవరకొండ చెవిలో ఏదో మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఫ్యామిలీ స్టార్ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్‌ అవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నిడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. మొద‌ట తెలుగు, తమిళ్‌ల్లో విడుదల కానుందట‌. కాగా రెండు వారాల తర్వాత హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేస్తారని టాక్‌.ఇక ఫ్యామిలీ స్టార్ రిలీజై ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.