“ఫ్యామిలీ స్టార్” కి మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..? పర్శనల్ మ్యాటర్ ని లీక్ చేయకుడదనే విజయ్ సినిమా పేరు మార్చేశాడా..?

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఫ్యామిలీ స్టార్ సినిమా హ్య్స్ష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లో వస్తున్నాయి . కేవలం కొద్ది గంటలే మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు విజయ్ దేవరకొండ ..హీరోయిన్ మృణాల్ ఠాకూర్ . విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ హీరోయిన్గా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ .

ఏప్రిల్ 5వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు విజయ్-మృణాల్. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ ను బయటపెట్టారు మేకర్స్. నిజానికి ఈ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ గోవర్ధన్ అంటూ బయట పెట్టారు . ఈ టైటిల్ వెనక ఓ ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉందట . విజయ్ దేవరకొండ తండ్రి పేరు గోవర్ధన్ . ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు కూడా గోవర్ధన్.

ట్రైలర్ లో చూస్తున్న విధంగా ఇంట్లో ఉన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని పనులు తానే చూసుకొని వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడానికి ఎంతవరకైనా వెళ్లే టైప్ ఆఫ్ క్యారెక్టర్ లో విజయ్ మనకు కనిపించబోతున్నాడు . అందుకే ముందుగా ఈ సినిమాకు గోవర్ధన్ అనే టైటిల్ పెట్టారట . ప్రతి మధ్యతరగతిలో ఓ గోవర్ధన్ ఉంటాడు . సినిమాకి బాగా కనెక్ట్ అవుతుంది అనుకున్నారట .

దాదాపు ఇదే టైటిల్ అనుకునే లోపే పబ్లిక్ కి మరింత దగ్గరగా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యే టైటిల్ పెడితే బాగుంటుంది అంటూ టీం అభిప్రాయపడటంతో ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ని పెట్టుకొచ్చారట . తండ్రి పేరు ఎక్కడ చెడిపోతుందో అన్న భయంతో కూడా విజయ్ దేవరకొండ ఈ పేరుని పెట్టనివ్వకుండా ఆపేశాడు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది . చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ఎందుకుంటుందో..???