టిల్లు పార్ట్ 3 స్టోరీ లీక్ చేసిన సిద్దు.. బోరింగ్ గా ఉంది అంటున్న నెటిజన్స్..!

2009లో నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. 2022లో రిలీజ్ అయిన డీజే టిల్లు మూవీతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సిద్దు ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.‌

అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సైతం రాబట్టింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 78 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి 100 కోట్ల చేరువలో ఉంది. అంతేకాకుండా 15 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లు ఫిలిం వర్గాల్లో టాప్ నడుస్తుంది. ఇక ఈ సందర్భంలోనే మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ పలుశోస్ కి హాజరవుతున్నారు టీం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు.. టిల్లు పార్ట్ 3 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. డీజె టిల్లు కదా ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్ పై సాగుతుంది. టిల్లు స్క్వేర్ కూడా అంతే. కానీ టిల్లు క్యూబ్ మాత్రం డిఫరెంట్. ఇందులో టిల్లుకు సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? అనే పాయింట్ పై కథ రన్ అవుతుంది. ఈ స్క్రిప్ట్ త్వరలో స్టార్ట్ అవుతుంది.. అంటూ చెప్పుకొచ్చాడు సిద్దు. ఇక ప్రజెంట్ సిద్దు చేసిన వ్యాఖ్యలు చేసిన కొందరు.. ఈ సినిమాని ఎన్ని పార్ట్స్ గా చూసిన అదే కదా ఉంటుంది. సో ఈ సినిమాని వదిలేసి సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి రండి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.