అల్లు అర్జున్ బర్తడే సందర్భంగా ఆ మూవీ రీ రిలీజ్.. గెట్ రెడీ ఫ్యాన్స్..!

స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకుని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరో అల్లు అర్జున్.‌ పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా హీరో అయిపోయిన బన్నీ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా మూవీ పై భారీ హైప్స్ కూడా నెలకొల్పాయి. ఇక ఇదిలా ఉంటే త్వరలోనే అల్లు అర్జున్ బర్తడే ఉంది.

ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈయ‌న సిని చరిత్రలో బ్లాక్బస్టర్ హిట్ సినిమాల్లో ఒకటైన జులాయి మూవీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. అంతేకాకుండా ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్ అండ్ ఇలియానా సైలెంట్ నెస్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఇంతగా పాపులర్ అయిన ఈ సినిమాని మరోసారి ప్రేక్షకులకి చూపిద్దామని డిసైడ్ అయిన డైరెక్టర్ అల్లు అర్జున్ బర్తడే సందర్భంగా ఆ కలను నెరవేరుస్తున్నారు.