శ్రీ సత్య నెల కష్టాన్ని ఒక్క ఎడిట్ తో తీసిపడేసిన టిల్లు స్క్వేర్ డైరెక్టర్.. ఎంత పని చేశావురా..!

బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ మొదట్లో ఎవరో కూడా పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ ప్రస్తుతం శ్రీ సత్య అంటే ఒక బ్రాండ్ కింద మారింది. స్టార్ హీరోల సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటుంది శ్రీ సత్య.

ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన టిల్లు స్క్వేర్ మూవీలో కూడా శ్రీ సత్య కనిపించింది. సిద్దు హీరోగా అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో శ్రీ సత్య సీన్స్ ఎక్కువగానే ఉన్నాయట. కానీ డైరెక్టర్ దానిని ఎడిటింగ్ లో కట్ చేపించేసాడట. మరి దీనికి కారణం ఏంటో తెలీదు కానీ మొదట ఈమెకి మరియు సిద్దు మధ్య అనేక సీన్స్ ఉన్నప్పటికీ ఆ సీన్స్ ని తొలగించారు ఎడిటర్స్.

ఏదేమైనా ఈ ఒక్క పనితో శ్రీ సత్య పరువుని గంగలో కలిపేసారనే చెప్పొచ్చు. ఎంతో కష్టపడి శ్రీ సత్య ఆ సినిమాలో నటిస్తే ఉన్నట్లుండి ఆ సినిమా నుంచి ఆ సీన్స్ తొలగించడంతో ఈమె సైతం చాలా నిరాశకు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా శ్రీ సత్య అనే ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.