జబర్దస్త్ కమెడియన్ యాదమ్ రాజు అరెస్ట్.. ఏం జ‌రిఇందంటే..?!

పటాస్, జబర్దస్త్ లాంటి కామెడీ షో ల ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకొని స్టార్ కమెడియన్ గా మారిన వారిలో యాదమ్మ రాజు ఒకరు. మొదట పటాస్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన యాదమరాజు.. తర్వాత జబర్దస్త్ షోలో కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. మ‌రో పక్క సోషల్ మీడియాలోను యూట్యూబ్ ఛానల్ బ్యాలెన్స్ చేస్తూ.. జబర్దస్త్ తో పాటు మరిన్ని బుల్లితెర కార్యక్రమాల్లో సందడి చేస్తున్నాడు. ఈ యంగ్ కమెడియన్ పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఓ సినిమా కోసం ప్రధాన పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యాడట.

ఇలా కెరీర్ పరంగా బిజీగా గడుపుతున్న యాదమ్ రాజు.. సడన్గా అరెస్ట్ అయ్యాడంటూ వైరల్ గా మారింది. యాదమ్ రాజు అరెస్ట్ కావడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించారని.. టాక్. అయితే సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. స‌డ‌న్‌గా యాదమ్మ రాజు అరెస్ట్ కావ‌డం వెనుక చాలా స్టోరీ నడిచిందని తెలుస్తోంది. అయితే నిజంగానే యాదమ్మ రాజు అరెస్ట్ అయ్యారు అనుకుంటే మీరు పప్పులో కాలేసిన‌ట్టే.

ఇదంతా ఓ సినిమా ప్రమోషన్ లో భాగం అట. ప్రస్తుతం యాదమ్ రాజు ప్రధాన పాత్రలో ఓసినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసమే ఈ న్యూస్ ని మరింతగా వైరల్ చేస్తున్నారట. ఇంతకీ స్టోరీ లైన్ ఏంటో తెలిస్తే నవ్వుతారు. తన ఆస్తిని తాను సంపాదించుకోవడానికి తన స్నేహితుడితో కలిసి వెంట్రుకలను సేకరిస్తున్నాడట. ఈ లైన్ పైన స్టోరీ మొత్తం రూపొందుతుందని త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటకు రానున్నట్లు తెలుస్తుంది.