ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ హీరో-హీరోయిన్స్ వీళ్లే..అందరు లవ్ మ్యారేజెస్ నే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకుంటున్న హీరో హీరోయిన్ల లిస్ట్ భారీగా పెరిగిపోతుంది . అస్సలు ఎక్స్పెక్ట్ చేయని హీరో హీరోయిన్లు కూడా పెళ్లి చేసేసుకుంటున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ తో పెళ్లి పీటలు ఎక్కిన విషయం అందరికీ తెలిసిందే . ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోదు అని అంతా అనుకున్నారు . అయితే హీరోయిన్ తాప్సి పెళ్లి వార్త ఏ రేంజ్ లో వైరల్ అయిందో కూడా మనకు తెలుసు .

కాగా నెక్స్ట్ ఇండస్ట్రీలో పెళ్లి పీటలు ఎక్కబోయే హీరో హీరోయిన్ల పేర్లు బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చాలామంది ఉన్నారు . వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు ప్రభాస్ . కచ్చితంగా ఈ సంవత్సరం ప్రభాస్ పెళ్లి అయిపోతుంది అంటున్నారు కుటుంబ సభ్యులు . అంతేకాదు హీరోయిన్ అనుష్క పెళ్లి కూడా ఇదే సంవత్సరంలో కచ్చితంగా అయిపోతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

అలాగే మోస్ట్ సెకండ్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని కూడా ఇదే సంవత్సరంలో పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యారట. అదే విధంగా యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ , సందీప్ కిషన్ అలాగే యంగ్ హీరోయిన్స్ వర్షాబోల్లమ్మ – అనన్య నాగళ్ళ- ఈషా రెబ్బ లాంటి బ్యూటీస్ కూడా ఇదే సంవత్సరంలో పెళ్లిళ్లు చేసుకోబోతున్నారట. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే వీళ్ళందరూ కూడా లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ఒక క్రేజీ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది..!!