క్రేజీ ప్రాజెక్ట్ కి కమిట్ అయిన లావణ్య..మెగా కోడలు ఖాతాలో మరో హిట్ పడిన్నట్లేగా..!!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొత్త కోడలు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి క్రేజీ ప్రాజెక్టుకు సైన్ చేసిందా..? అంటే ఎస్అన్న ఆన్సర్ వినిపిస్తుంది . పెళ్లి తర్వాత ఆమె నటించిన ఒకే ఒక్క వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ . ఈ సిరీస్ లో చాలా చాలా పర్ఫెక్ట్ గా కనిపించింది. మెగా ఇంటి పరువును ఎక్కడా తీయకుండా చాలా పద్ధతిగా మెరిసింది . అయితే సినిమాలో అలా పద్ధతిగా మెరవాలంటే అది కుదరని పని ..అది అందరికీ తెలిసిందే.

అక్కడో ఇక్కడో ఎక్కడో ఒకచోట హద్దులు మీరాల్సి ఉంటుంది . అయితే లావణ్య త్రిపాఠి మాత్రం అలాంటి సీన్స్ ఉన్న సినిమాలను ఖరాఖండిగా రిజెక్ట్ చేసేస్తుందట. రీసెంట్గా మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు కమిట్ అయిందట. ఈ సినిమాలో అమ్మడు ఓ పాపకి తల్లిగా కనిపించబోతుందట . కుటుంబ బాధ్యతల కోసం ఆమె కష్టపడే విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నారట .

మందు అలవాటు ఒక ఫ్యామిలీని ఎలా రోడ్డు మీదకు పడేలో చేస్తుందో అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుందట . ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి భర్తలేని వైఫ్ గా నటించబోతుందట . ఒక తాగుబోతు నిర్లక్ష్యంగా ఉండి కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా పోతే భార్య పిల్లల కోసం ఏం చేస్తుంది? ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది..? ఆమెను సమాజం ఎలా చూస్తుంది అనే విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట . ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంటుంది లావణ్య అంటున్నారు అభిమానులు..!!