ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ కంటే ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? విజయ్ ఎందుకు వద్దు అన్నాడంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురాం దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు . ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటించింది . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు. ఏప్రిల్ 5వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది.

కాగా ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా పూజ హెగ్డేను అనుకున్నారట మేకర్స్. అయితే విజయ్ దేవరకొండ ఆమెను రిజెక్ట్ చేశాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . నిజానికి ఈ సినిమా కంటే ముందే వాళ్ళ కాంబోలో ఇంకో సినిమా కూడా సెట్ అయింది. పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్టు జనగణమనలో హీరోయిన్గా పూజ హెగ్డే చూస్ చేసుకున్నాడు విజయ్. అయితే ఆ సినిమా ఆగిపోయింది .

ఆ టైంలోనే విజయ్ – పూజా హెగ్డేల మధ్య ఏవో ఇష్యూస్ వచ్చాయట . ఆ కారణంగానే ఈ సినిమాలో పూజకు ఛాన్స్ లేకుండా చేశాడు విజయ్ దేవరకొండ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . కానీ విజయ్ దేవరకొండ పక్కన పూజ హెగ్డే కంటే మృణాల్ ఠాకూర్ బాగా సెట్ అయింది అన్నారు జనాలు. చూద్దాం మరి ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో ..?విజయ్ దేవరకొండ కెరియర్ను ఎలా మలుపు తిప్పబోతుందో..?