ఈసారి పక్క ప్రూఫ్ తో అడ్డంగా దొరికిపోయిన రష్మిక-విజయ్.. ఇక తప్పించుకోలేరు బ్రదర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ రొమాంటిక్ లవబుల్ పెళ్లి కానీ జంట ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం అది కచ్చితంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా..అనే చెప్పాలి. వీళ్ళు ప్రేమించుకుంటున్నారా ..? లేదు డేటింగ్ చేస్తున్నారా ..? లేక ఫ్రెండ్సా ..?అని ఎవరు చెప్పలేకపోతున్నారు . వీళ్లది ప్రేమ అని ..వీళ్ళ కంటే ముఖ్యంగా వీళ్ళ ఫాన్స్ డిసైడ్ అయిపోతున్నారు . మా మధ్య అలాంటిది ఏదీ లేదురా బాబోయ్ అంటూ విజయ్-రష్మిక ప్రతిసారి క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు వీళ్ళకి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

ఆ పిక్స్ వీళ్ళ మధ్య రిలేషన్షిప్ వేరే లెవెల్ లో ఉంది అని ప్రూవ్ చేస్తూనే ఉంటాయి . తాజాగా అలాంటి ఒక పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే విజయ్ దేవరకొండ అదే విధంగా రష్మిక మందన్నా.. ఎప్పటికప్పుడు కొన్ని ఫొటోస్ వీడియోస్ షేర్ చేసుకుంటూనే ఉంటారు. రీసెంట్గా అలా షేర్ చేసిన ఫొటోస్ వీడియోస్ వీళ్లిద్దరూ ఒకే చోట ఉన్నారు అన్న విషయాన్ని బయట పెట్టేసింది.

తాజాగా రష్మిక ఒక నెమలి ఫోటోను తన ఇంస్టా స్టోరీలో బ్యూటిఫుల్ అంటూ పోస్ట్ చేసింది . అయితే అదే బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ దేవరకొండ ఉన్న పిక్చర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ స్టా స్టోరీలో ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి వీడియో షేర్ చేశాడు. విజయ్ ఆ వీడియోలో రష్మిక షేర్ చేసిన బ్యాక్ గ్రౌండ్ పిక్చర్స్ ఉన్నాయి . అంతే ఇంకేముంది వీళ్లిద్దరూ ఒకే చోట ఉన్నారు అని.. పెళ్లికి ముందే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని ..వీళ్ళు ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని ..ఆ విషయాన్ని వీళ్ళు దాచిపెడుతున్నారు అని ..ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వీళ్ళ ప్రేమ వ్యవహారమే కోడైకూస్తుంది..!!