ఫ్యామిలీ స్టార్ కి విజయ్ కాకుండా ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..? అస్సలు నమ్మలేరు..!

కేవలం కొద్దిగంటలే.. కొద్ది గంటలంటే.. కొద్ది గంటల్లోనే విజయ్ దేవరకొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంత కష్టపడ్డాడో దర్శకుడు పరశురాంపేట కూడా అంతే కష్టపడ్డాడు . గీతాగోవిందం తర్వాత మరోసారి ఇలాంటి క్రేజీ కాంబో సెట్ అవ్వడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు.

ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది . బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు జనాలు. సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఫ్యామిలీ స్టార్ సినిమా ని నిజానికి హీరో నానితో తెరకెక్కించాలనుకున్నారట . పరుశురాంపేట అదేవిధంగా దిల్ రాజు. అయితే నాని ఈ సినిమా కథను రిజెక్ట్ చేయడంతోనే విజయ్ దేవరకొండ చేతికి వెళ్ళింది అంటూ ప్రచారం జరుగుతుంది .

మనకు తెలిసిందే ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్ అన్న ఫ్యామిలీ స్టోరీస్ అన్న అందరికీ ముందుగా గుర్తొచ్చేది నానినే.. అయితే ఎంతసేపు నాని అలాంటి పాత్రలో నటిస్తే తనకు లైఫ్ ఉండదు అని భావించి ఈ సినిమాను రిజెక్ట్ చేశారట . అంతేకాదు అంతకుముందే మృణాల్ ఠాకూర్ తో హాయ్ నాన్న సినిమాలో కనిపించాడు. మరోసారి ఇదే జంట రిపీట్ అయితే డిజాస్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి . జనాలకు బోర్ కొట్టేయొచ్చు. ఆ కారణంగానే ఈ కథను రిజెక్ట్ చేశాడట . ఫైనల్లీ విజయ్ దేవరకొండ ఈ కథలో ఇరుక్కున్నాడు . మొత్తానికి మరికొద్ది గంటల్లోనే సినిమా హిట్టా పట్టా అన్న విషయం తేలిపోబోతుంది..!!